బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళ మృతి... !

Published : May 12, 2021, 02:48 PM IST
బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళ మృతి... !

సారాంశం

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని శ్రీనగర్ మెన్ రోడ్డులో బైక్ పై వస్తున్న ఓ మహిళను లారీ డి కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.  

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరులోని శ్రీనగర్ మెన్ రోడ్డులో బైక్ పై వస్తున్న ఓ మహిళను లారీ డి కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ప్రమాదానికి రోడ్డు మధ్యలో తవ్వడమే కారణం అని తెలుస్తోంది. శ్రీనగర్ మెన్ రోడ్డులో మంచినీటి సరఫరా సమస్య వుండటంతో కొత్తగా పైపు లైన్స్ వేస్తున్నారు. దీనికి సంబంధించిన పైపులను రోడ్డు మీద అలాగే వదిలేసి కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు.

ఈ మధ్యలో పనులు పూర్తిగా ఆపేశారు. పైపులైను పనులకోసం తవ్వేసి, పనులు ఆపేయడంతో రహదారి పూర్తిగా గుంటలు గా ఏర్పడింది.మరోవైపు రోడ్డుపైనే ఆక్రమణలు వుండటంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఇలా ఓ మహిళ చనిపోవడం జరిగింది. మునిసిపల్ అధికారులు ఇకనైనా స్పందించి శ్రీనగర్, ఆరండల్ పేట 3వ అడ్డా రోడ్ పూర్తి చేయాలని కోరుతున్న శ్రీనగర్ వాసులు కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage
నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu