రాజమండ్రిలో ఆక్సిజన్ ఆన్ వీల్స్: ఆర్టీసీ బస్సుల్లో కరోనా రోగులకు ఆక్సిజన్‌ బెడ్స్

Published : May 12, 2021, 02:51 PM IST
రాజమండ్రిలో ఆక్సిజన్ ఆన్ వీల్స్: ఆర్టీసీ బస్సుల్లో కరోనా రోగులకు ఆక్సిజన్‌ బెడ్స్

సారాంశం

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ తో కూడిన బెడ్స్  ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా రెండు ఏసీ బస్సులను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను తయారు  చేశారు.  

రాజమండ్రి: ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ తో కూడిన బెడ్స్  ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా రెండు ఏసీ బస్సులను కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ప్రయోగాత్మకంగా ఈ బస్సులను తయారు  చేశారు.  గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో రైల్వే శాఖ రైల్వే బోగీలను  కరోనా రోగుల కోసం తయారు చేయించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రెండు ఏపీఎస్ఆర్‌టీసీ బస్సులను కోవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారు  చేయించారు. 

ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు బెడ్స్ దొరకని పక్షంలో ఈ బస్సుల్లో ఆక్సిజన్  బెడ్స్ పై రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రతి బస్సులో  సుమారు 12 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు.  రాజమండ్రి ప్రభుత్వాసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకని కరోనా రోగులకు  ఈ బస్సుల్లో చికిత్స అందించనున్నారు.  ఆసుపత్రిలో బెడ్స్ ఖాళీ కాగానే  ఈ బస్సు నుండి రోగులను ఆసుపత్రికి తరలించనున్నారు. జగనన్న ప్రాణవాయి రథ చక్రాలు పేరుతో ఈ బస్సులను పిలుస్తున్నారు.ఆర్టీసీ సహకారంతో ఓ ఎన్జీఓ సంస్థ  ఈ బస్సులను  రూపకల్పనకు ముందుకు వచ్చింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!