జగన్-స్టువర్ట్ పురం దొంగలు ఒకటే..

Published : Nov 04, 2017, 08:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
జగన్-స్టువర్ట్ పురం దొంగలు ఒకటే..

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజా సంకల్ప యాత్ర దగ్గర పడే కొద్దీ టిడిపి నేతల విమర్శలు సృతిమించిపోతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ ను విమర్శించటంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తాజాగా వర్ల రామయ్య జగన్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలరం రేపుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ చేపట్టిన పాదయాత్ర వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని అన్నారు. పైగా జగన్ ను స్టూవర్ట్ పురం దొంగలతో పోల్చుతూ ఓ సంఘటన చెప్పటం సంచలనంగా మారింది.

స్టువర్టుపురం దొంగలు సింహచలంలో దొంగతనం చేయడానికి వెళుతూ కనక దుర్గమ్మని దర్శించుకుని రక్షించమని వెదుకున్నారట. అయితే ఆ సమయంలోనే వారంరూ అరెస్టుయ్యారట. అలాగే ఆర్ధిక నేరం చేసిన జగన్ కూడా పాదయాత్ర విజయవంతం చేయమని ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. మంచి పనికి దేవుడి ఆశీసులు ఉంటాయని ఇలాంటి వాటికి కాదని చెప్పారు. అందుకు ఉదాహరణగానే స్టువర్టుపురం దొంగలు గజ్జెల ప్రసాద్ ముఠా జైళ్లలో ఉందని పోల్చారు.

ఎన్నటికీ వైఎస్ జగన్ సీఎం కాలేడని, ఆర్ధిక నేరాలపై జైలుకెళ్ళక తప్పదని జోస్యం కూడా చెప్పారు. పాదయాత్ర చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కాలేరన్నారు. చంద్రబాబునాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పుకున్నారు. ప్రజల ఆశీసులు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి కాబట్టే రాబోయే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు.

జగన్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అతి కొద్ది రోజుల్లోనే చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నట్లు కూడా తెలిపారు. జగన్ ని స్టూవర్టు పురం దొంగలతో పోల్చటం వివదాస్పదంకగా, స్టూవర్టుపురం వాసుల మనోభావాలు దెబ్బ తెసేలా వర్ల వ్యాఖ్యానించడంతో పెను దుమారం రేగుతోంది.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu