
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అనంతపురం జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు ట్రెండ్ క్రియేట్ చేస్తూనే వున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ బైకర్స్ కి చేతులెత్తి దణ్ణం పెడుతూ వార్తల్లోకెక్కిన మడకశిర ఇన్స్ పెక్టర్ శుభకుమార్.. ఇప్పుడు మరో కొత్తరకం సీక్వెన్స్ కి తెర లేపారు. మీ ప్రాణం మీ డ్రైవింగ్ లోనే వుంది.. మీ కుటుంబం మీమీదే ఆధారపడి వుంది అంటూ తాము ఉపన్యాసాలిస్తే జనం పట్టించుకోవడం లేదు గనుక.. ఈసారి హిజ్రాలను రంగంలోకి దింపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ హిజ్రాల చేతికి మైకులిచ్చిమరీ చేపిస్తున్నారు ఇన్స్ పెక్టర్ శుభకుమార్. హెల్మెట్ ధరించని వాళ్ళను ఆపి రోడ్డు మీదనే అందరిముందూ హిజ్రాలతో ముద్దులు పెట్టించే సాహసానికి కూడా తెగించారాయన.
ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ అవేర్ నెస్ కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాక తప్పడం లేదంటున్నారు శుభకుమార్. ఆయనలోని కమిట్ మెంట్ ని చూసి మడకశిర జనం ఫిదా అయిపోతున్నారు.