సైకో జగన్ ముద్దులు కాస్తా గుద్దులుగా మారాయి..: టిడిపి అనిత

Published : Jul 14, 2023, 02:55 PM IST
సైకో జగన్ ముద్దులు కాస్తా గుద్దులుగా మారాయి..: టిడిపి అనిత

సారాంశం

 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి మహిళా నేత వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మంగళగిరి : కాలకేయుడిగా మారిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహాశక్తి గద్దె దింపుతుందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎన్నికల సమయంలో మహిళల ఓట్ల కోసం జగన్ పెట్టిన ముద్దులు అదికారంలోకి వచ్చా గుద్దులుగా మారాయన్నారు. ఈ వైసిపి పాలనలో మహిళాలోకం దగాపడిందని... సైకో జగన్ ఎప్పుడు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతాడా అని ఎదురుచూస్తున్నారని అనిత పేర్కొన్నారు.

మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మహిళా నాయకుల కోసం ఏర్పాటుచేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మహిళల కోసం టిడిపి మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని వివరించేందుకు మహాశక్తి చైతన్య రథయాత్ర చేపట్టారు. 

ఈ సందర్భంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని... మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఈ హామీ ఇంకా నెరవేరలేదని అన్నారు. మద్యం ఆదాయాన్ని చూపించి మహిళల మాంగల్యాలను 25 వేల కోట్లకు జగన్ తాకట్టుపెట్టాడని ఆరోపించారు. సీఎం నిర్ణయాలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని అనిత అన్నారు. 

Read More  వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల పొత్తు ఉంటుంది.. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి

అసలు తెలుగు మహిళా శక్తిని బయటకు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్, టీడీపీ దే అని అనిత అన్నారు. కుటుంబ ఆస్తిలో కొడుకులతో సమానంగా ఆడబిడ్డలకు కూడా హక్కు కల్పించిన ఘనత తమ పార్టీదని అన్నారు. ఇప్పుడు వైసీపీ మహిళా నేతలు వారి తండ్రి ఆస్తిలో సమానవాటా తీసుకుంటున్నారంటే అది టీడీపీ పెట్టిన భిక్షేనని అనిత పేర్కొన్నారు. మహిళల స్వయం శక్తితో బ్రతికేలా కృషిచేసిన ఘనత చంద్రబాబుది అని అనిత అన్నారు. 

ఇప్పుడు భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో మహాశక్తి పథకాన్ని చంద్రబాబు కానుకగా ఇచ్చారని అనిత పేర్కొన్నారు. ఈ మహాశక్తి పథకాన్ని చైతన్య రథయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళతామని అన్నారు. టిడిపి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళలకు మహాశక్తి పథకం అమలు చేస్తామని వంగలపూడి అనిత స్పష్టం చేసారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్