ఆ వెబ్‌సైట్ నకిలీది.. ఆనందయ్య మందును అమ్ముకోవాలని స్కెచ్, ఇవిగో ఆధారాలు: సోమిరెడ్డి

By Siva Kodati  |  First Published Jun 5, 2021, 3:51 PM IST

ఆనందయ్య మందుపై వివాదం కొనసాగుతోంది. ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేదం మందును వైసీపీ నేతలు అమ్ముకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


ఆనందయ్య మందుపై వివాదం కొనసాగుతోంది. ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేదం మందును వైసీపీ నేతలు అమ్ముకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చిల్‌డీల్.కామ్ వెబ్‌సైట్‌ను గో డాడీ సంస్థ నుంచి శేషిత టెక్నాలజీ కొనుగోలు చేసిందన్నారు. ఆనందయ్య తయారు చేసే మూడు మందుల్ని ఒక్కో దానిని ఒక్కో రేటుకు అమ్ముకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.

దీనిపై రేపు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదని.. ఆ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మొద్దని ఆనందయ్య తనయుడు స్వయంగా చెప్పారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఓ కుటుంబం తయారు చేసిన మందును కాకాని గోవర్థన్ రెడ్డి ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

Latest Videos

undefined

Also Read:ఆనందయ్య ఐ డ్రాప్స్‌పై 8 పరీక్షలు చేశాం.. దుష్ప్రభావాలు లేవు, కానీ: ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక

ఉచిత మందుకు డోర్ డెలివరీ పేరుతో కుంభకోణానికి తెరదీశారని ఆయన ఆరోపించారు. ఆనందయ్య మందుతో కాకాని లబ్ధిపోందాలని చూస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. ఉచిత మందును 167 రూపాయలకు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే సోమిరెడ్డి ఆరోపల్ని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఖండించారు. సోమిరెడ్డివి పనీ, పాటలేని ఆరోపణలని వ్యాఖ్యానించారు. 

click me!