వైద్య విద్యార్ధినిపై వేధింపులు: నెల్లూరు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డిపై వేటు

Siva Kodati |  
Published : Jun 05, 2021, 02:21 PM IST
వైద్య విద్యార్ధినిపై వేధింపులు: నెల్లూరు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డిపై వేటు

సారాంశం

నెల్లూరు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను తిరుపతి  రుయా ఆసుపత్రికి బదిలీ చేశారు. మరోవైపు నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తయ్యింది.

నెల్లూరు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను తిరుపతి  రుయా ఆసుపత్రికి బదిలీ చేశారు. మరోవైపు నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల ఘటనపై విచారణ పూర్తయ్యింది. ప్రభుత్వానికి రెండు కమీటీలు నివేదిక సమర్పించాయి. ఏసీఎస్సార్ మెడికల్ కాలేజీలో డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ట్ త్రిసభ్య కమిటీలు విచారణ జరిపాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్, డాక్టర్లను ప్రశ్నించాయి. అంతకుముందు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని మహిళా కమీషన్ ఆదేశించింది. వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా సూపరింటెండెంట్ వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా వుంచుతామని స్పష్టం చేశారు. 

అంతకుముందు వైద్య విద్యార్థినిపై నెల్లూరు జిజిహెచ్ సూపరిండెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. తక్షణమే సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను  ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తో ఈ విషయంపై మాట్లాడిన ఆమె ఇటువంటి కామాంధులను ఉపేక్షించరాదని కోరారు. తమపట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాధిత విద్యార్థినులు మహిళా కమీషన్ వాట్సాప్ నెంబరు  9394528968 కు స్వయంగా సంప్రదించవచ్చని పద్మ తెలిపారు. 

Also Read:వైద్య విద్యార్థినిపై సూపరింటెండెంట్ లైంగిక వేధింపులు... మహిళా కమీషన్ సీరియస్ (వీడియో)

కరోనా సమయంలో ప్రత్యక్షదైవంగా చూస్తున్న వైద్య వృత్తికి మచ్చ తెచ్చే విధంగా నెల్లూరు సూపరిండెంట్ వ్యవహరించటం బాధాకరమన్నారు. ఇతని తప్పుడు ప్రవర్తనతో మానసికంగా కృంగిపోయిన  బాధితులు అందరూ నిర్భయంగా వివరాలు మహిళా కమిషన్ కు వెల్లడించాలని పద్మ కోరారు. ఇతని పై ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు రహస్యంగా ఉంచబడతాయని అందరూ ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. 

కూతురు వయసు విద్యార్థినితో నెల్లూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించాడు. తన రూమ్ కి రమ్మంటూ.. నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉపాధ్యాయుడి కారణంగా తాను పడిన వేదనను సదరు విద్యార్థిని ఆడియో రికార్డు చేయగా.. ఇప్పుడు అది బయటకు వచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?