విజయసాయి రెడ్డి ఆదేశాలతోనే నా ఆస్తుల ధ్వంసం: హైకోర్టును ఆశ్రయించిన పల్లా శ్రీనివాసరావు

By Arun Kumar PFirst Published Jun 18, 2021, 12:32 PM IST
Highlights

గాజువాక జంక్షన్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తన బిల్డింగ్ కూల్చివేశారని... రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేతలు చేపట్టారంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. 

 విశాఖపట్నం: అక్రమ నిర్మాణాలంటూ జివిఎంసి అధికారులు తన భవనాలను కూల్చివేయడంపై గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లం శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. గాజువాక జంక్షన్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తన బిల్డింగ్ కూల్చివేశారని... రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేతలు చేపట్టారని పల్లా ఆరోపించారు. భవనాల కూల్చివేతతో తనకు కోటీ 86 లక్షల నష్టం వాటిల్లిందని... దానిని జివిఎంసి అధికారులు చెల్లించేలా చూడాలని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్ లో పేర్కొన్నారు పల్లా. 

ఆస్తుల విధ్వంసం విషయంలో ప్రతివాదులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ పోలీస్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులను చేర్చారు. అందరిపైనా వ్యక్తిగతంగా పిటిషన్‌ను పల్లా శ్రీనివాస్ దాఖలు చేసారు. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని... కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.

read more రూ.750కోట్లంటూ ప్రచారం... నిరూపిస్తే రాజకీయ సన్యాసం: పల్లా శ్రీనివాసరావు సవాల్ (వీడియో)

గతంలో కూడా పల్లా శ్రీనివసరావు తన భవనాన్ని కూల్చినవారిపై పోలిస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.  వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి సేవకులుగా వ్యవహరించిన జీవీఎంసి కమిషనర్ సృజన , సిసిపి విద్యుల్లత , డిసిపి నరెంద్ర రెడ్డిలు రాత్రిపూట కోవిద్ నిబందనలు ఉల్లంఘించి... ఎటువంటి నోటిసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో వున్నా అక్రమంగా భవనం లోపలి వచ్చి కూల్చి వేసారు. వీరి అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకొవాలని,  న్యాయపరమైన పోరాటం చేస్తానని కుల్చిన చోటే మళ్లీ నిర్మాణం చేపడతానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.

click me!