లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం... నిందితుడు అరెస్ట్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 18, 2021, 11:14 AM ISTUpdated : Jun 18, 2021, 11:43 AM IST
లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం... నిందితుడు అరెస్ట్ (వీడియో)

సారాంశం

ఓ కామాంధుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణయ్యాడో కామాంధుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్ట్ చేసి కటకటాలవెనక్కి తోసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి పట్టణంలో నివాసముండే మైనర్ బాలికను మహేంద్ర అనే యువకుడు నిత్యం వేదించేవాడు. ఇంట్లోంచి బయటకు రావడమే పాపం బాలిక వెంటపడి వేధించేవాడు. వెంబడించమే కాదు రోడ్డుపైనే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. 

అతడి వేధింపులు ఇటీవల మరింత మితిమీరడంతో తట్టుకోలేకపోయిన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో వున్న గడ్డి మందు తాగి బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి తల్లిదండ్రులు బాలిక అస్వస్థతను గుర్తించి హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. గత పదిరోజులగా ప్రైవేటు ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతుంది.  ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉంది.

వీడియో

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహేంద్రను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం సీఐ శేషగిరిరావు మాట్లాడుతూ...  మహేంద్ర వేధింపులు కారణంగానే మైనర్ బాలిక ఆత్మహత్యయత్నించిందన్నారు. నిందితుడు మహేంద్రను కోర్టులో హాజరుపరిచి తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శేషగిరిరావు  హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు