అనిల్ యాదవ్ అక్రమాస్తుల చిట్టా ఇదే..: ఆధారాలతో సహా బైటపెట్టిన లోకేష్

Published : Jul 05, 2023, 05:35 PM IST
అనిల్ యాదవ్ అక్రమాస్తుల చిట్టా ఇదే..: ఆధారాలతో సహా బైటపెట్టిన లోకేష్

సారాంశం

నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేష్ మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేసారు. 

నెల్లూరు : వైసిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసారు. కేవలం ఆరోపణలే కాకుండా మాజీ మంత్రి భూఅక్రమాలు, బినామీల పేరుతో పెట్టిన అక్రమాస్తుల చిట్టా ఇదేనంటూ ఆధారాలను బయటపెట్టారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అనిల్ వెయ్యి కోట్లకు పైనే సంపాదించారని లోకేష్ ఆరోపించారు. 

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కు దొంతాలి వద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేర్ల మీద రూ.10 కోట్ల విలువచేసే 50 ఎకరాల భూమి వుందని లోకేష్ తెలిపారు. అలాగే నాయుడుపేటలో రూ.100 కోట్ల విలువైన మరో 58 ఎకరాలు కూడా బినామీ పేర్లతో వున్నాయన్నారు. ఇక ఇనుమడుగు సెంటర్ లో బినామీలు రాకేష్, డాక్టర్ అశ్విన్ పేరుతో రూ.10 కోట్ల విలువైన 400 అంకణాలు స్థలం వుందని లోకేష్ వెల్లడించారు. 

ఇస్కాన్ సిటీ లో బినామీల పేర్లతో రూ.33 కోట్ల విలువైన 87 ఎకరాల భూమి అనిల్ కు వుందని లోకేష్ తెలిపారు. అల్లీపురంలో అనిల్ తమ్ముడు అశ్విన్ పేరిట రూ.105 కోట్ల విలువైన 42 ఎకరాలు వుందన్నారు. ఇందులో 7ఎకరాలు ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి కూడా వుందని...  దాన్ని అనిల్ కబ్జా చేసి తన భూమిలో కలిపేసుకున్నాడని లోకేష్ ఆరోపించారు. సాదరపాళెంలో అశ్విన్ పేరిట రూ.48 కోట్ల విలువగల మరో 12 ఎకరాలు వుందన్నారు. 

Read More  దమ్ముంటే నా సవాలను స్వీకరించు.. నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ ఫైర్..

ఇక మంత్రి అనిల్ బినామీ చిరంజీవికి ఓ పెద్ద కాంట్రాక్టర్ నుండి దశల వారీగా కోట్ల రూపాయలు అందాయని లోకేష్ ఆరోపించారు. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ రూ.25 కోట్ల విలువైన 4 ఎకరాలు భూమి అనిల్ కు వుందన్నారు. దామరమడుగులో బావమరిది పేరుతో రూ.4కోట్ల విలువైన 5 ఎకరాలు వుందన్నారు. గూడూరు-చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు లేపేసిన అనిల్ 40 ఎకరాల్లో లే అవుట్ వేసారని లోకేష్ ఆరోపించారు. 

ఇలా మాజీ మంత్రి అనిల్ బినామీల పేరిట కోట్ల ఆస్తులు వున్నాయని లోకేష్ ఆరోపించారు. నెల్లూరు ప్రజల కోసం కాకుండా అక్రమాస్తుల సంపాదించడం కోసమే అనిల్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అతడి నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని లోకేష్ అన్నారు. 

అయితే నారా లోకేష్‌కు ఇటీవల తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ స్పందించారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని నారా లోకేష్ ఆరోపణలు చేస్తున్నారని.. అయితే రాజకీయాల్లో వచ్చాక తాను ఆస్తులు పోగొట్టుకున్నానని అన్నారు. దీనిపై తిరుమల కొండపై ప్రమాణానికి సిద్దమని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువగా ఉందని నిరూపించే దమ్ము నారా లోకేష్‌కు ఉందా? అని అనిల్ సవాలు విసిరారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!