మోడీనివ్యతిరేకించే పార్టీలు ఏపీలో లేవని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
అమరావతి: మోడీని వ్యతిరేకించే పార్టీలు ఏపీలో లేవని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. బుధవారంనాడు విజయవాడలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మన అష్ట దరిద్రాలకు కేంద్రమే కారణమని ఆయన ఆరోపించారు. యూనిఫాం సివిల్ కోడ్ బీజేపీ అజెండాలోనిదేనని ఆయన గుర్తు చేశారు.
యూనిఫాం సివిల్ కోడ్ ను లా కమిషన్ తిరస్కరించిన తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కేంద్రం భావించడం సరైంది కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. నెంబర్ గేమ్ ఆడడం కోసం బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు యత్నిస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. యూనిఫాం సివిల్ కోడ్ పై ఏపీలోని పార్టీలు తమ అభిప్రాయం తెలపాలని ఆయన కోరారు.
undefined
డయాఫ్రం వాల్ ఎందుకు దెబ్బతిందని ఆయన ప్రశ్నించారు. ఇందుకు బాధ్యులను గుర్తించాలని ఆయన కోరారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో డయాఫ్రంవాల్ కడుతారా, దెబ్బతిన్న స్థలంలోనే డయాఫ్రంవాల్ కడుతారా అని ఆయన అడిగారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావసం కల్పించారా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఎందుకు టీడీపీ, వైసీపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదన్నారు. పవన్ వారాహి యాత్ర విజయవంతమైందన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు పట్టు ఎక్కువ ఉంటుందన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీకి ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు