మీ వెంటే నేను: సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరం

By telugu team  |  First Published Jan 12, 2020, 11:29 AM IST

రాజధాని రైతుల కోసం ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరంగా ఉందనున్నట్టు తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు, నిరసనలు చేస్తూ.. పండగ చేసుకునే పరిస్థితుల్లో లేరని, అందుకోసం తాను కూడా సంబరాలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చంద్రబాబు తెలిపారు. 


అమరావతి: రాష్ట్రంలో రాజధాని విషయమై రైతులు రోడ్డెక్కి తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇవి కాస్తా ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న విషయం తెలిసిందే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని చేయకూడదని, అమరావతినే కొనసాగించాలని ఆయన కూడా రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే, రాజధాని రైతుల కోసం ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు చంద్రబాబు దూరంగా ఉందనున్నట్టు తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు, నిరసనలు చేస్తూ.. పండగ చేసుకునే పరిస్థితుల్లో లేరని, అందుకోసం తాను కూడా సంబరాలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని చంద్రబాబు తెలిపారు. 

Latest Videos

Also read: ఏడు నెలల పాలన, జనం ముఖాల్లో చిరునవ్వు కరువు: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

చంద్రబాబు కూడా రైతు బిడ్డ కాబట్టే, రైతుల కోసం తన సంతోషాలకు దూరంగా ఉన్నారని, రైతుల బాధలు ఎరిగినవాడని నారావారిపల్లె, పరిసర ప్రాంత రైతులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌ నిన్న శనివారం ఉదయమే తిరుపతికి చేరుకున్నారు. నేడు, ఆదివారం ఉదయం నారావారిపల్లెకు వెళ్లనున్నారు.  సోమవారం అమరావతికి తిరుగు పయనం కానున్నట్లు తెలుస్తోంది. 

click me!