కందుకూరు తొక్కిసలాట కేసు : టీడీపీ ఇన్‌ఛార్జ్ నాగేశ్వరరావు అరెస్ట్, హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

By Siva KodatiFirst Published Jan 5, 2023, 7:58 PM IST
Highlights

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు.  

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నాయుడు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో వుండగా... నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు నుంచి రెండు కార్లలో హైదరాబాద్ వచ్చిన పోలీసులు.. నాగేశ్వరరావును అరెస్ట్ చేసి కందుకూరుకు తీసుకెళ్లారు. అలాగే చంద్రబాబు కుప్పం పర్యటనకు సంబంధించి కూడా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మొత్తం 15 మందిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాళ్లబూదుగూరు ఎస్సై మునిస్వామి ఫిర్యాదుపై ముగ్గురిపై, గంగవరం ఎస్సై సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో ఇద్దరిపై పలమనేపరు రూరల్ సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదుపై పదిమందిపై కేసులు పెట్టారు. 

ALso REad: చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు చెక్‌ పెట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్.. ఆ నిబంధన వైసీపీకి మాత్రమేనా..!

కాగా... గత బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీల నుంచి ఒక్కొక్కరికి రూ.24 లక్షల ఆర్ధిక సాయం అందించారు. అలాగే మృతుల పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ కూడా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు

click me!