మెగాస్టార్ చిరంజీవితో గంటా శ్రీనివాసరావు భేటీ... సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Siva Kodati |  
Published : Oct 08, 2022, 03:32 PM IST
మెగాస్టార్ చిరంజీవితో గంటా శ్రీనివాసరావు భేటీ... సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

సారాంశం

మెగాస్టార్ చిరంజీవితో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత చిరు ఇంటికి వెళ్లిన గంటా.. పలు విషయాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి పొలిటికల్ ట్వీట్ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

మెగాస్టార్ చిరంజీవితో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత చిరు ఇంటికి వెళ్లిన గంటా.. పలు విషయాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది. 

కాగా.. రాజకీయాలకు నేను దూరంగా వున్నా.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరంజీవి ఇటీవల చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పుట్టించాయి. ఇంతలోనే చిరంజీవికి కొత్త ఐడీ కార్డ్ జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2027 వరకు పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఐడీ కార్డ్ ఇచ్చింది. రాజకీయాలపై చిరంజీవి కామెంట్స్ చేసిన తర్వాతి రోజే ఈ ఐడీ కార్డ్ రావడంతో మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ వుంటుందా అని జోరుగా చర్చ జరుగుతోంది. 

అప్పటి నుంచే గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్‌ను సోషల్ మీడియాలో, సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా ప్రస్తావించడంతో చిరంజీవి అభిమానులతో పాటు, పవన్ అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. గత బుధవారం అనంతపురంలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌లో కూడా చిరంజీవి.. సినిమాలోని డైలాగ్‌లు చెప్పి అభిమానులను ఉత్సహపరిచారు. అంతేకాకుండా వర్షంలోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

ALso REad:నేను ఏ పక్షంలో వున్నా పవన్‌కి ఇబ్బందే.. అందుకే రాజకీయాలను వదిలేశా : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

‘‘నేనెప్పుడూ సీమకు వచ్చిన ఆ నేల తడుస్తుంది. పులివెందులలో పొలిటికల్ క్యాంపెయిన్ నిర్వహించినప్పుడు.. ఇంద్ర సినిమా షూటింగ్‌లోనూ వర్షం కురిసింది. ఈరోజు కూడా వర్షం పడటం శుభపరిణామం’’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవల వదలిన డైలాగ్‌పై చర్చలు, డిబేట్లు ఎన్నో జరిగాయని చెప్పారు. అదే సమయంలో వేదికపై నుంచి మరో డైలాగ్‌ను చెప్పి అభిమానుల్లో జోష్ నింపారు.

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించారు. అయితే చాలా కాలంగా ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్