ఆ మంత్రి కండలు చూసి క్యూ కడుతున్నారా... బ్లూ మీడియా చెప్పేదిదేనా?: బుద్దా సెటైర్లు

By Arun Kumar PFirst Published Sep 7, 2020, 7:54 PM IST
Highlights

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభించడం సీఎం జగన్ చలవేనని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టిడిపి నాయకులు బుద్దా వెంకన్న సెటైర్లు విసిరారు. 

విజయవాడ: స్టేట్స్ బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2019 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం గత శనివారం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభించింది. దీంతో ఈ ఘనత తమదంటే తమదని వైసిపి, టిడిపి నాయకులు పేర్కొంటున్నారు. గతంలో టిడిపి పాలన కారణంగానే ఈ అవార్డు లభించిందని టిడిపి అంటుంటే... వైసిపి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పారిశ్రామిక విధానమే ఈ ర్యాంకుకు కారణమని అంటోంది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా టిడిపి అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న సోషల్ మీడియా వేదికన దీనిపై స్పందిస్తూ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రిపై సెటైర్లు విసిరారు.   

''మంత్రి గౌతంరెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో, ఎడవాలో అర్థం కావడం లేదు. జగన్ రెడ్డి సంస్కరణల వలనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చింది అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష...ఈ ఏడాదిన్నర లో మీ వైఎస్ జగన్ గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు. 
 
''వైకాపా పారిశ్రామిక పాలసి, మేకపాటి గారి కండలు చూసి క్యూ కట్టిన పారిశ్రామికవేత్తలు అని బ్లూ మీడియా వార్తలు తప్ప క్యూ ఎక్కడ ఉందో కనపడటం లేదు.క్యూ ఎక్కడ ఉందో చెబితే ఎండకి నీరసం రాకుండా మజ్జిగ ప్యాకెట్లు పంచుతాం గౌతమ్ గారు'' అంటూ సెటైర్లు విసిరారు. 

బ్రేకింగ్: ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్‌లో ఏపీకి అగ్రస్థానం

ఇక వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెట్టాలన్న నిర్ణయంపైనా ప్రభుత్వాన్ని వెంకన్న నిలదీశారు. ''మీటర్లు రైతుల పాలిట యమపాశాలు. రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్లు బిగిస్తారు. వ్యవసాయానికి వినియోగించుకున్న కరెంటులో నిర్ణీత యూనిట్ల మేరకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది'' అన్నారు. 

''ఆ సబ్సిడీని కూడా  రైతులు ముందుగా బిల్లు మొత్తం కట్టేయాలని ఆ తర్వాత తాము సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్తారు'' అంటూ బుద్దా వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు. 

   

click me!