తూర్పుగోదావరిలో కరోనా కరాళ నృత్యం: ఏపీలో5 లక్షలు దాటిన కేసులు

Published : Sep 07, 2020, 05:42 PM ISTUpdated : Sep 07, 2020, 05:56 PM IST
తూర్పుగోదావరిలో కరోనా కరాళ నృత్యం: ఏపీలో5 లక్షలు దాటిన కేసులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 8368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 5,06,493కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 8368 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 5,06,493కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో అనంతపురంలో 584, చిత్తూరులో 875, తూర్పుగోదావరిలో 1312, గుంటూరులో 765, కడపలో447, కృష్ణాలో 193, కర్నూల్ లో 316, నెల్లూరులో 949,ప్రకాశంలో419, శ్రీకాకుళంలో559,విశాఖపట్టణంలో405, విజయనగరంలో 594, పశ్చిమగోదావరిలో 950 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 70 మంది మృతి చెందారు. ప్రకాశంలో 10 మంది, గుంటూరులో 9 మంది, చిత్తూరులో ఎనిమిది, కడప, పశ్చిమగోదావరిలో ఏడుగురి చొప్పున మృతి చెందారు. కృష్ణా, నెల్లూరులో ఐదుగురు, అనంతపురం, కర్నూల్ , శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో నలుగురి చొప్పున మరణించారు. తూర్పు గోదావరిలో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,487కి చేరుకొంది. 


రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -45,884, మరణాలు 39,527
చిత్తూరు -43,436, మరణాలు 481
తూర్పుగోదావరి -68,260, మరణాలు 430
గుంటూరు -40,900, మరణాలు 428
కడప -31,928, మరణాలు 257
కృష్ణా -18,675, మరణాలు 313
కర్నూల్ -48,702, మరణాలు 399
నెల్లూరు -38,227, మరణాలు347
ప్రకాశం-29,493, మరణాలు 330
శ్రీకాకుళం-28,543, మరణాలు 257
విశాఖపట్టణం -41,192, మరణాలు 324
విజయనగరం -24,505, మరణాలు 180
పశ్చిమగోదావరి-43,853, మరణాలు 360

PREV
click me!

Recommended Stories

జగన్ ఇంటి ముందు నుంచే లోకేష్ మాస్ సవాల్ | Nara Lokesh At Tadepalli Palace | Asianet News Telugu
పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi