
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అదనపు చార్జ్‌షీట్‌పై సీఎం జగన్ స్పందించాలని తెలుగు దేశం పార్టీ నేత బోండా ఉమా డిమాండ్ చేశారు. సొంత మనుషులు ఇంత క్రిమినల్ మైండ్‌తో ఉంటారని వివేకానందరెడ్డి కూతురు సునీత చెప్పిన మాటలు జగన నిజస్వరూపానికి నిదర్శమని అన్నారు. వివేకా హత్య కేసులో దొరికిన దొంగల బండారాన్ని సీబీఐ బయటపెట్టిందని అన్నారు. అయినప్పటికీ సీఎం జగన్ స్పందించడం వెనక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినవారంతా జైలుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు.
Also Read: ప్రైవేట్ హాస్టల్‌లో పాము కాటుతో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం..
2019 మార్చి 23న సునీతను వైఎస్ భారతి కలిశారా? లేరా? అని సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే సునీతా రెడ్డి కుటుంబానికి రూ. 500 కోట్లు ఇస్తామన్నారని.. ఇది నిజామా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యకేసులో టీడీపీ నేతలు పేర్లు చెప్పమన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సీబీఐ విచారించాలని కోరారు. నిందితులను కాపాడేందుకు జగన్ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలో ఏ9, ఏ10 పేర్లు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు.