టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వీరిద్దరూ ప్రకటనలు చేస్తున్నారన్నారు.
గుంటూరు: ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హైద్రాబాద్ లోని శాశ్వత నివాసానికి వెళ్లిపోతారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.గుంటూరులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విడివిడిగా జీవిస్తున్నా కలిసే ఉన్నారన్నారు.ఈ ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వంత ఇల్లు లేదన్నారు. ఎన్నికల తర్వాత ఈ ఇద్దరు హైద్రాబాద్ లోని శాశ్వత ఇళ్లకు వెళ్లిపోతారని చెప్పారు.
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం ఎలా ఊరుకుంటుందని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల పరువుకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందున కోర్టులో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అంబటి రాంబాబు వివరించారు.
undefined
మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు దోహదం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ వ్యాఖ్యలను వదిలేసి వ్యక్తిగత డేటా అంటూ పవన్ కళ్యాణ్ కొత్త అంశాన్ని లేవదీసినట్టుగా మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
వాలంటీర్ల వ్యవస్థ మంచి ఫలితాలు ఇస్తున్నందున దానిపై తప్పుడు ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని టీడీపీ, జనసేనలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో లబ్ది పొందేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. ఈ కేసులో వాస్తవాలను సీబీఐ వెలికితీసే ప్రయత్నం చేస్తుందన్నారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని జడ్జిమెంట్ గా ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు.
also read:డేటా ప్రైవసీ: జగన్ కు మూడు ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్
ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించిన సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను సీఎం జగన్ దూషించడాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలను మంత్రి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోడీని దూషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.