జగన్ రెడ్డి మకాం విశాఖలో కాదు జైల్లోనే... రిపేర్లుంటే చేయించుకో..: మాజీ మంత్రి బండారు ఎద్దేవా (వీడియో)

By Arun Kumar PFirst Published Apr 21, 2023, 1:42 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విశాఖ నుండే త్వరలో పాలన ప్రారంభం అవుతుందని... తాను కూడా అక్కడే కాపురం పెట్టనున్నట్లు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి బండారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

విశాఖపట్నం : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇటీవల చోటుచేసుకుంటున్న పరణామాలపై స్పందిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే బాబాయ్ హత్య కేసులో మరో బాబాయ్ అరెస్ట్, తమ్ముడు అవినాష్ రెడ్డి కూడా అరెస్టయ్యేలా వుండటంతో తాడేపల్లి కొంపలోంచి బయటకు రాలేని పరిస్థితిలో జగన్ వున్నాడన్నారు. లండన్ పర్యటనను కూడా రద్దుచేసుకున్నారంటేనే పరిస్ధితి ఎలా వుందో అర్థమవుతుందని మాజీ మంత్రి అన్నారు. 

త్వరలోనే విశాఖపట్నంలో కాపురం పెడతానంటూ ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా సత్యనారాయణమూర్తి ఘాటుగా స్పందించారు.బాబాయ్ హత్య కేసులో సూత్రధారులు జైలుకి వెళ్లడం ఖాయం... తాడేపల్లి, విశాఖలో కాదు జగన్ మకాం జైల్లోనే అంటూ సెటైర్లు వేసారు. కాబట్టి ఇప్పుడే రాష్ట్రంలోని జైళ్ళలో ఏమయినా రిపేర్లుంటే చేయించుకోవాలని మాజీ మంత్రి సూచించారు. 

వీడియో

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని... వీటన్నింటిని అధిగమించి విజయవంతంగా పూర్తి చేయాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామని బండారు సత్యనారాయణ అన్నారు. లోకేష్ పాదయాత్రలో సెల్ఫీ ఛాలెంజ్ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చారన్నారు. పాదయాత్రలో ఆయన ఇచ్చే ప్రతి హామీని 100శాతం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని జగన్ లా మోసం చేయబోమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. 

Read More  రూ. 150 కోట్ల ఖర్చుకు రెడీ, గన్నవరంలో దమ్మునోడే నిలుపుతాం: చింతమనేని సంచలనం

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నాలుగో వంతు ఈరోజుతో పూర్తయ్యిందని అన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు ప్రజలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. పాదయాత్రలో యువతతో పాటు రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటుంటే అసలు జనమే లేరంటూ వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంటా మండిపడ్డారు. 

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు షాకిచ్చారని... సౌండ్ లేకుండా తీర్పు ఇచ్చారని మాజీ మంత్రి అన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని...రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మాజీ మంత్రి గంటా పేర్కొన్నారు. 

click me!