వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్: మధ్యంతర బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

By narsimha lode  |  First Published Apr 21, 2023, 1:01 PM IST

కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి  మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టు  స్టే  ఇచ్చింది.  


న్యూఢిల్లీ: కడప  ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో  ఎదురు దెబ్బ తగిలింది.  తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై  సుప్రీంకోర్టు  శుక్రవారంనాడు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు  సోటీసులను సుప్రీంకోర్టు  జారీ చేసింది.   అయితే  ఈ నెల  24వ తేదీవరకు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేయవద్దని  సీబీఐని   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేయవద్దని   సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

హైకోర్టు మధ్యంతర  బెయిల్ పై  స్టే విధిస్తే  వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్  చేసే అవకాశం ఉందని  సుప్రీంకోర్టులో  అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది  వాదించార. అయితే  ఈ నెల  24వ తేదీ వరకు  అరెస్ట్  చేయవద్దని  సుప్రీంకోర్టు  ఆదేశించింది. ఈ పిటిషన్ పై  ఈ నెల 24న విచారణ చేపడుతామని  సుప్రీంకోర్టు  తెలిపింది.  సోమవారంనాడు అన్ని విసయాలపై  విచారణ  చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.  

Latest Videos

undefined

ఈ నెల  25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేయవద్దని  తెలంగాణ హైకోర్టు  ఈ నెల  18వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  ఈ నెల  25న తుది తీర్పును ఇవ్వనున్నట్టుగా  తెలంగాణ  హైకోర్టు ప్రకటించింది. 

also read:వైఎస్ అవినాష్ రెడ్డికి ట్విస్టిచ్చిన సునీతారెడ్డి:: మధ్యంతర బెయిల్ పై సుప్రీంలో పిటిషన్

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు  చేయడాన్ని  సుప్రీంకోర్టులో  ఈ నెల  20న  వైఎస్ సునీతారెడ్డి  సవాల్  చేశారు.  ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సునీతారెడ్డి  కోరారు.  సునీతారెడ్డి  న్యాయవాది అభ్యర్ధన మేరకు  సీజేఐ ధర్మాసనం  ఈ పిటిషన్ ను  ఇవాళ విచారణ  నిర్వహించనున్నట్టుగా  సుప్రీంకోర్టు  తెలిపింది. ఇవాళ  ఉదయం  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం  నేతృత్వంలో  విచారణ నిర్వహించింది.  తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే  ఇచ్చింది.

ఈ పిటిషన్ పై పూర్తిస్థాయి వాదనలు వింటామని  సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.  వైఎస్ సునీతారెడ్డి , సీబీఐ  తరపు న్యాయవాదుల వాదనలు  విన్న తర్వాత   ప్రతిపాదుల తరపున ఎవరైనా వాదించేందుకు  న్యాయవాదులున్నారా అని  సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తరపు న వాదించేందుకు  తాను సిద్దంగా  ఉన్నట్టుగా  న్యాయవాది రంజిత్  రెడ్డి  చెప్పారు. అయితే  తన వద్ద  పిటిషన్ కాపీ లేదని రంజిత్ రెడ్డి  చెప్పారు. ఈ పిటిషన్ పై విచారణను  వాయిదా వేయాలని కోరారు. దీంతో  ఈ నెల  24వ తేదీకి ఈ పిటిషన్ పై విచారణను  సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. 

click me!