చెప్పుతో ఎక్కడ కొట్టాలో పోసాని చెప్పాలి.. అయ్యన్న పాత్రుడు డిమాండ్..

Published : Dec 17, 2021, 09:00 AM IST
చెప్పుతో ఎక్కడ కొట్టాలో పోసాని చెప్పాలి.. అయ్యన్న పాత్రుడు డిమాండ్..

సారాంశం

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన బాగోలేకపోతే తనను చెప్పుతో కొట్టండి అని 2019 ఎన్నికలకు ముందు ఆయన ఘంటాపథంగా చెప్పారు. అప్పుడు పోసాని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు టిడిపి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.

నర్సీపట్నం : ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలన బాగోలేకపోతే తనను చెప్పుతో కొట్టండి అని 2019 ఎన్నికలకు ముందు ఆయన ఘంటాపథంగా చెప్పారు. అప్పుడు పోసాని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇప్పుడు టిడిపి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.

posani krishna muraliపై తాజాగా టీడీపీ నేత ayyanna patrudu విమర్శలు చేశారు.  గత మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో పోసాని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం చేయలేనంత అభివృద్ధి చేసి చూపిస్తారని, లేనిపక్షంలో ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టండి.. అని పోసాని కృష్ణ మురళి అన్నారని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. ఎక్కడ కొట్టాలో పోసాని చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ లో హైద్రాబాద్ అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ విషయమై పోసాని కృష్ణ మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసాని ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు  పరిశీలిస్తున్నారు.

8 మాసాలుగా వేరే చోట పోసాని కృష్ణ మురళి నివాసం ఉంటున్నారు.  పోసాని కృష్ణ మురళి నివాసం పై దాడికి సంబంధించి వాచ్ మెన్  పోసాని కృష్ణ మురళికి సమాచారం ఇచ్చాడు. అంతేకాదు పోలీసులకు కూడ వాచ్ మెన్ ఫిర్యాదు చేశాడు.రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్  ఏపీ ప్రభుత్వంతో పాటు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై పోసాని కృష్ణ మురళి స్పందించారు.  పోసాని కృష్ణ మురళి వరుసగా రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.

AP politics Roundup 2021: పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్.. ‘రిపబ్లిక్‌’తో మొదలు.. మాటల తూటాలు

రెండు రోజుల క్రితం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు.ఈ సమావేశం ముగించుకొని వెళ్తున్న సమయంలో పోసానిపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.పవన్ కళ్యాణ్  పరువుకు నష్టం కల్గించేలా మాట్లాడారని పోసాని కృష్ణ మురళిపై జనసేన  తెలంగాణ ఇంచార్జీ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పంజాగుట్ట పోలీసులు న్యాయ సలహాకు పంపారు.

ఈ నెల 29వ తేదీన గుంటూరు మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని  వపన్ కళ్యాణ్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  వైసీపీ నేతలతో పాటు పోసాని కృష్ణ మురళి లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానమిచ్చారు.పవన్ కళ్యాణ్ పై  తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడి జరగడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్