నంద్యాల సైకిల్ దే...భారీ ఆధిక్యం దిశగా భూమా

Published : Aug 28, 2017, 12:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నంద్యాల సైకిల్ దే...భారీ ఆధిక్యం దిశగా భూమా

సారాంశం

అందరూ అనుకున్నట్లుగానే నంద్యాల ఉపఎన్నిక ఫలితమొచ్చింది. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిపై భారీ ఆధిక్యతతో ఉన్నారు.   తాజా సమాచారం ప్రకారం 15 రౌండ్లు అయ్యేటప్పటికి టిడిపి అభ్యర్ధి 26,018 ఓట్ల మెజారిటితో ఉన్నారు. గెలుపుకు అవసరమైన మంత్రాగం మొత్తాన్ని చంద్రబాబే దగ్గరుండి చూసుకున్నారు. మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, నేతలతో ప్రచారం చేయించినా తెర వెనుక జరిగిన మంత్రాంగమే భూమాను గెలిపించింది.

అందరూ అనుకున్నట్లుగానే నంద్యాల ఉపఎన్నిక ఫలితమొచ్చింది. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డిపై ....గెలిచారు. నిజానికి టిడిపికి గెలుపు అవకాశాలు తక్కువనే అనుకున్నారు. అయితే, టిడిపి గెలిచింది. అందుకు కారణం ప్రధానంగా చంద్రబాబునాయుడు మంత్రాగమే అనటంలో సందేహాలు అవసరం లేదు.

గెలుపు లక్ష్యంతో బరిలోకి దిగిన భూమా ప్రచారంలో నానా అవస్తలు పడ్డది వాస్తవం. అయినా గెలిచారంటేనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం 15 రౌండ్లు అయ్యేటప్పటికి టిడిపి అభ్యర్ధి 26,018 ఓట్ల మెజారిటితో ఉన్నారు.

గెలుపుకు అవసరమైన మంత్రాగం మొత్తాన్ని చంద్రబాబే దగ్గరుండి చూసుకున్నారు. మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీ, నేతలతో ప్రచారం చేయించినా తెర వెనుక జరిగిన మంత్రాంగమే భూమాను గెలిపించింది.  గతంలో ఎన్నడూ లేనివిధంగా,  ఓ ప్రతిపక్ష నేత ఉపఎన్నికలో ఏకంగా 13 రోజులు ఒక నియోజకవర్గంలో క్యాంపు వేసినా ఉపయోగం లేకపోయింది.

శిల్పా గెలుపు కోసం జగన్ నియోజకవర్గంలోని  అనేక గ్రామాల్లో రోడ్డు షోలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని వీది, వీధి తిరిగి ఓట్లడిగారు. ఇంటింటి ప్రచారం కూడా చేసారు. పోటీలో ఉన్నది భూమా-శిల్పానే అయిప్పటికీ పోటీ మాత్రం చంద్రబాబు-జగన్ మధ్యే అన్నట్లు సాగింది. శిల్పా గెలుపుకు జగన్ పెద్ద పోరాటమే చేసినా ఫలితం రాలేదు. కాకపోతే అందరికీ ఆశ్చర్యమేమిటంటే ఏ రౌండులో కూడా వైసీపీకి మెజారిటీ రాలేదు.

చివరకు ఆదుకుంటుందనుకున్న నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో కూడా ఏం జరిగిందో అర్ధం కావటం లేదు. నంద్యాల పట్టణంలో టిడిపికే మెజారిటీ వచ్చినా మిగిలిన రెండు మండలాల్లో వైసీపీ మెజారిటీ సాధించి మొత్తం మీద కొద్ది మెజారిటీతో అయినా శిల్పా గెలుస్తారని వైసీపీ నేతలు చాలా నమ్మకంతో ఉన్నారు.

అనుకున్నదొకటి,  జరిగింది మరొకటి కావటం జగన్ కు పెద్ద షాకే. ఫలితాన్ని బట్టి చూస్తే జనాలెవరూ ఫిరాయింపు రాజకీయాలను, అవినీతిని అసలు పట్టించుకోవటం లేదని అర్ధమౌతోంది. అదే సమయంలో ఒత్తిళ్ళకు, ప్రలోభాలకు కూడా లొంగిపోతారని కూడా ఫలితం రుజువు చేసింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్