ప్రత్యేక హోదా: కేంద్రంపై మరోసారి అవిశ్వాసం నోటీసిచ్చిన టీడీపీ

First Published Jul 17, 2018, 3:40 PM IST
Highlights

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో  టీడీపీ మరోసారి   కేంద్రంపై అవిశ్వాస నోటీసును మంగళవారం నాడు  ఇచ్చింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు.


అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో  టీడీపీ మరోసారి   కేంద్రంపై అవిశ్వాస నోటీసును మంగళవారం నాడు  ఇచ్చింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన  హమీలను అమలు చేయాలని  కేంద్రప్రభుత్వాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని   టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మాణ నోటీసులు ఇచ్చారు.

జూలై 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాల్లో కేంద్రంపై మరోసారి అవిశ్వాస తీర్మాణ నోటీసులు ఇచ్చింది. . ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడ  కేంద్రంపై టీడీపీ అవిశ్వాస నోటీసులు ఇచ్చింది.  కానీ,  ఉభయ సభల్లో అవిశ్వాస తీర్మాణం నోటీసులు అందినా కానీ, సభలు ఆర్డర్‌లో లేనందున  అవిశ్వాస నోటీసులపై చర్చ జరగలేదు.

అయితే రేపటి నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో  కూడ  కేంద్రం తీరును ఎండగట్టేందుకు గాను  అవిశ్వాస తీర్మాణ నోటీసులు ఇచ్చారు టీడీపీ ఎంపీలు. కేంద్రంపై తాము ప్రతిపాదించే  అవిశ్వాసానికి మద్దతివ్వాలని టీడీపీ ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల మద్దతును కూడ కూడగట్టాయి. 
 

click me!