సంబంధం లేని కేసులో నా పేరు చేర్చారు: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా చేర్చడంపై లోకేష్

By narsimha lode  |  First Published Sep 26, 2023, 2:51 PM IST


అమరాతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా చేర్చడంపై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.  ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు.


అమరావతి: సంబంధం లేని కేసులో తనను  ఏ 14 గా చేర్చాలని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  ఏ 14గా  నారా లోకేష్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు.ఈ మేరకు సీఐడీ అధికారులు కోర్టులో మెమోను  అందించారు.  అయితే ఈ కేసు విషయమై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నాడు స్పందించారు.   ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో తనకు సంబంధం లేదన్నారు. యువగళం పేరు వింటేనే జగన్ గజగజలాడుతున్నారని  లోకేష్ విమర్శించారు.తప్పుడు కేసులు పెట్టినా,అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని లోకేష్ తేల్చి చెప్పారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా  ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అప్పట్లో చంద్రబాబు సర్కార్ చేపట్టింది. అయితే  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను అడ్డగోలుగా మార్చారని జగన్ సర్కార్ ఆరోపణలు చేసింది. ఈ విషయమై  సీఐడీకి ఫిర్యాదు చేసింది.ఈ మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది.  మాజీ మంత్రి నారాయణ, చంద్రబాబుపై  సీఐడీ అభియోగాలు మోపింది.  తమ వారి భూములకు విలువ పెరిగేలా  అలైన్ మెంట్ ను మార్చారని  సీఐడీ ఆరోపిస్తుంది.  ఈ కేసులో  చంద్రబాబుపై పీటీ వారంట్ కూడ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే  ఈ కేసులో  చంద్రబాబు బెయిల్ కోరుతూ  దాఖలు చేసిన పిటిషన్ పై  ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. 

Latest Videos

undefined

also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 26కు వాయిదా

ఏపీ ఫైబర్ నెట్ కేసులో కూడ చంద్రబాబుపై  కోర్టులో సీఐడీ అధికారులు పీటీ వారంట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఈ నెల  9వ తేదీన  చంద్రబాబు అరెస్టయ్యారు. ఈ కేసులో అరెస్టై  జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు  చంద్రబాబునాయుడు.వచ్చే నెల 5వ తేదీ వరకు  చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. 

click me!