అంగళ్లు ఘటన.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

Published : Sep 26, 2023, 02:21 PM IST
అంగళ్లు ఘటన.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..

సారాంశం

అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తనపై పెట్టిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఆయన న్యాయవాదులు, మరోవైపు పోలీసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు హైకోర్టులో వాదనలు ముగియగా.. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. 

ఇక, అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి  తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబుపై ఉన్న పలు కేసుల్లో పోలీసులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంగళ్ల ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు ఉండటంతో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక, స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు