టీడీపీ నేత నందం సుబ్బయ్య అంతిమయాత్ర: పాల్గొన్న లోకేష్

Published : Dec 31, 2020, 10:43 AM IST
టీడీపీ నేత నందం సుబ్బయ్య  అంతిమయాత్ర: పాల్గొన్న లోకేష్

సారాంశం

కడప జిల్లాలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంతిమయాత్ర గురువారం నాడు  ప్రొద్దుటూరులో ప్రారంభమైంది. అంతిమయాత్రలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.

కడప:

కడప: కడప జిల్లాలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య అంతిమయాత్ర గురువారం నాడు  ప్రొద్దుటూరులో ప్రారంభమైంది. అంతిమయాత్రలో టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.

సుబ్బయ్య కుటుంబసభ్యులను బుధవారం నాడు లోకేష్ పరామర్శించారు. రాత్రి ప్రొద్దుటూరులోనే లోకేష్ ఉన్నారు. గురువారం నాడు ఉదయం సుబ్బయ్య భార్య, కుటుంబ సభ్యులతో లోకేష్ మరోసారి మాట్లాడారు. సుబ్బయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

also read:ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య: నలుగురి అరెస్ట్

సుబ్బయ్య హత్యకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది కారణమని ఆయన సుబ్బయ్య భార్య ఆరోపించారు. సుబ్బయ్య హత్య కేసులో నలుగురిని బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే, ఆయన బావమరిది పేర్లను చేర్చాలని లోకేష్ తో పాటు టీడీపీ నేతలు బుధవారం నాడు ఆందోళన నిర్వహించారు.టీడీపీ ఆందోళన తర్వాత పోలీసులు సుబ్బయ్య హత్య కేసులో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పేరుతో పాటు ఆయన బావమరిది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. 

also read:సుబ్బయ్య హత్య: దిగొచ్చిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లోకి ఎమ్మెల్యే, ఆయన బావమరిది

గురువారం నాడు ఉదయం సుబ్బయ్య ఇంటి నుండి స్మశానవాటిక వరకు లోకేష్ పార్టీ నేతలతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?