వైసీపీ నేతలకు టిడిపి సభ్యత్వమా ?

First Published Mar 10, 2017, 1:15 PM IST
Highlights

పార్టీ సభ్యత్వం 70 లక్షలే కాదని, మొత్తం 120 కోట్ల మందికీ సభ్యత్వం ఇచ్చేయచ్చన్నారు.

టిడిపిని ఒక్కసారిగా కష్టాలు  కమ్ముకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కూడా భోగస్ అనేందుకు వైసీపీ నేతలు సాక్ష్యాలు బయటపెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం టిడిపి సభ్యత్వం 70 లక్షలకు చేరుకుందని కేకులు కట్ చేసుకుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. సీన్ అక్కడ కట్ చేస్తే అదంతా భొగస్సేనని వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు తేల్చేసారు. ఎలాగంటే, వైసీపీ పార్టీ నేతలకు, క్రియాశీల సభ్యులకు కూడా టిడిపి సభ్యత్వం ఇచ్చేసారంటూ పెద్ద బాంబే పేల్చారు.

 

తన వాదనకు మద్దతుగా వెల్లంపల్లి కొన్ని సక్ష్యాలను కూడా మీడియా ముందుంచారు. అందులో వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి లాజరస్తో పాటు ఆయన మద్దతు దారులకు కూడా సభ్యత్వాలు దక్కాయట. వారి పేర్లతో టిడిపి గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయట. ఎలా సాధ్యమైంది ఇదంతా? అంటే, ఓటర్ జాబితాను ముందేసుకుని సభ్యత్వ నమోదు పూర్తి చేసారట. ఇంకేముంది అనుకున్నవాళ్ళందరికీ టిడిపి సభ్యత్వం ఇచ్చేసినట్లే.  కాకపోతే సభ్యులకే తెలీదట తమకు టిడిపిలో సభ్యత్వం ఉన్నట్లు.

 

అంతేకాదండోయ్ ఇంకా ఉంది ఈ భాగోతం. ఓటర్ జాబితాలో నుండే ఫొటోలు కూడా తీసేసుకుని దానితోనే గుర్తింపుకార్డులు కూడా ముద్రించారు. ఆ గుర్తింపుకార్డుల ఆధారంగా అందరికీ బీమా సౌకర్యం కూడా కల్పించారట. బహుశా అందుకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బు కూడా పార్టీనే కట్టేసుంటుంది. వెల్లంపల్లి మీడియాతో మట్లాడుతూ, ఈ పద్దతిలో పార్టీ సభ్యత్వం 70 లక్షలే కాదని, మొత్తం 120 కోట్ల మందికీ సభ్యత్వం ఇచ్చేయచ్చన్నారు. వ్యక్తులకు తెలీకుండానే భోగస్ సభ్యత్వాలివ్వటంపై త్వరలో కోర్టుకు వెళతామంటూ చెప్పట కొసమెరుపు.

click me!