జగన్ ను తిట్టడానికేనా ఫిరాయింపులున్నది ?

First Published Oct 28, 2017, 12:47 PM IST
Highlights
  • వైసీపీ నుండి టిడిపిలోకి చేరిన 21 మంది ఎంఎల్ఏలను టిడిపి కూడా రికార్డుల ప్రకారం తమ ఎంఎల్ఏలుగా చూపలేకపోతోందన్నది వాస్తవం.
  • అందుకనే, పోయిన అసెంబ్లీ సమావేశాల తర్వాత రికార్డుల ప్రకారం ఫిరాయింపు ఎంఎల్ఏలను జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనను ఇంకా వైసీపీ సభ్యులుగానే చూపుతున్నారు.

ఫిరాయింపు ఎంఎల్ఏలు, మంత్రులను చూస్తుంటే అయ్యోపాపం అనిపిస్తోంది.  ఎందుకంటే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టటానికి తప్ప టిడిపికి వారు ఇంకెందుకు ఉపయోగ పడటం లేదు. వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాక్కున్నారు. వారిలో కొందరికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. అయితే, సమస్య అంతా అక్కడే మొదలైంది. తాము గెలిచింది వైసీపీ తరపునే అయినా ప్రస్తుతం ఉంటున్నది టిడిపిలో. అందుకనే వీరిచేత రాజీనామాలు చేయించాలని వైసీపీ పట్టుపడుతోంది.

సరే, వైసీపీ డిమాండ్ ను చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదరనుకోండి అదివేరే సంగతి.  అదేవిధంగా, వైసీపీ నుండి టిడిపిలోకి చేరిన 21 మంది ఎంఎల్ఏలను టిడిపి కూడా రికార్డుల ప్రకారం తమ ఎంఎల్ఏలుగా చూపలేకపోతోందన్నది వాస్తవం. అందుకనే, పోయిన అసెంబ్లీ సమావేశాల తర్వాత రికార్డుల ప్రకారం ఫిరాయింపు ఎంఎల్ఏలను జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పనను ఇంకా వైసీపీ సభ్యులుగానే చూపుతున్నారు. అదే విషయాన్ని వైసీసీ ఎంఎల్ఏలు మీడియాలో ప్రస్తావించారు.

అంటే, ఫిరాయింపు ఎంఎల్ఏలు ఇటు గెలిచిన వైసీపీకీ కాకుండా పోయారు, అటు ఫిరాయించిన తర్వాత టిడిపి సభ్యులుగాను చెప్పుకోలేకపోతున్నారు. అందుకే వారిని చూస్తుంటే జాలేస్తోంది. ఆ విషయాన్ని ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా అంగీకరించారు. అంటే వారిలో వారే ఎంతగా కుమిలిపోతున్నారో అర్ధమైపోతోంది. అదుకే తమనందరూ ఫిరాయింపుదారులని చెప్పుకోవటం తమకు కూడా ఇబ్బందిగానే ఉందని స్వయంగా అంగీకరించారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ తీసుకున్న నిర్ణయానికి ప్రధాన కారణం కూడా ఫిరాయింపు వ్యవహారమే. అసెంబ్లీలో కానీ బయటకానీ జగన్ ను ఎప్పుడు తిట్టాలన్నా టిడిపి ఎక్కువగా పిరాయింపు ఎంఎల్ఏలు, మంత్రులనే ప్రయోగిస్తోంది. వైసీపీ ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తోంది. అదే సమయంలో తమకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్న జగన్ తిట్టాలంటే ఫిరాయింపులకు కూడా ఇబ్బందిగానే ఉంటోంది. అంటే, ఫిరాయింపుల చేత రాజీనామాలు చేయించకుండా చంద్రబాబు ఆడుతున్న నాటకంలో ఫిరాయింపులు పావులుగా మారిపోయారన్నది స్పష్టమవుతోంది.

click me!