లండన్ వెళుతున్న జగన్

Published : Oct 28, 2017, 07:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
లండన్ వెళుతున్న జగన్

సారాంశం

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళుతున్నారు. శనివారం ఉదయం బయలుదేరుతున్న జగన్ మళ్ళీ మూడు రోజుల తర్వాత తిరిగి వస్తారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళుతున్నారు. శనివారం ఉదయం బయలుదేరుతున్న జగన్ మళ్ళీ మూడు రోజుల తర్వాత తిరిగి వస్తారు. నవంబర్ 6వ తేదీ నుండి పాదయాత్ర చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవ్వాలంటే దాదాపు 7 మాసాలు పడుతుంది. ఒకసారి పాదయాత్ర మొదలైతే మళ్ళీ ఎక్కడికీ వెళ్లడానికి కుదరదు కదా? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో జగన్ కూతురు వైఎస్ హర్ష విద్యాభ్యాసం చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర మొదలైతే మధ్యలో ఆపటానికి వీల్లేదు కాబట్టి  కూతురును చూడటం కోసం ముందుగానే ఓ సారి లండన్ వెళుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Return rush: పండ‌గ అయిపోయింది.. ప‌ల్లె ప‌ట్నం బాట ప‌ట్టింది. హైవేపై ఎక్క‌డ చూసినా వాహ‌నాలే
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet