ఏపీలో వరద బీభత్సం: బాధితులకు టీడీపీ చేయూత.. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, సీనియర్లతో కమిటీలు

By Siva Kodati  |  First Published Nov 20, 2021, 6:55 PM IST

రాష్ట్రంలో భారీ వర్షాలతో (ap rains) తల్లడిల్లుతున్న ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ (telugu desam party) నిర్ణయించింది. దీనిలో భాగంగా టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆదేశం మేరకు పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కమిటీలను నియమించారు.


రాష్ట్రంలో భారీ వర్షాలతో (ap rains) తల్లడిల్లుతున్న ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ (telugu desam party) నిర్ణయించింది. దీనిలో భాగంగా టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) ఆదేశం మేరకు పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నేతలతో కమిటీలను నియమించారు. కమిటీల్లోని సభ్యులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలవనున్నారు. క్షేత్రస్థాయిలో బాధితులకు అవసరమైన సహాయక చర్యలను చేపట్టనున్నారు.

కమిటీల వివరాలు :

Latest Videos

కడప జిల్లా : 

  •     సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు 
  •     కాలువ శ్రీనివాసులు, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు 
  •     ఎన్. అమరనాధ్ రెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
  •     నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు 

చిత్తూరు జిల్లా : 

  •     నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు
  •     అనగాని సత్య ప్రసాద్, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి 
  •     ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు 
  •     పరసా వెంకట రత్నం, మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు 


నెల్లూరు జిల్లా : 

  •     డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి
  •     బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్లు కోఆర్డినేటర్
  •     ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 
  •     దామచర్ల సత్య, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి 

 
అనంతపురం జిల్లా : 

  •     ఎన్.ఎమ్.డి. ఫరూఖ్, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు
  •     కె.ఈ. ప్రభాకర్, ఎమ్మెల్సీ 
  •      మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ 

అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కదలి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, మందులు అందించాలని సూచించారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌తో (ntr trust) సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతాల్లో పర్యటించాలని పార్టీ నేతలకు సూచనలు చేశారు. తాను కూడా త్వరలో పర్యటన చేయనున్నట్టు టెలికాన్ఫరెన్స్‌లో వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 

ALso Read:వరద బాధితులకు సహాయం చేయండి.. కదలి రండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

ప్రభుత్వం కంటే తమ పార్టీ శ్రేణులే ముందుగా వరద బాధితులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలు సహా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని అన్నారు. ఈ జిల్లాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉన్నదని తెలిపారు. భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న జిల్లాల్లో టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపు ఇచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని సూచించారు. పసిపిల్లలకు పాలు, బిస్కెట్స్ వంటి ఆహార పదార్థాలు అందించి ఆకలి తీర్చాలని అన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్, టీడీపీ, ఐటీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆహారం, మందులు పంపిణీ జరుగుతున్నదని వివరించారు.

click me!