Gottipati Ravikumar: భువనేశ్వరి గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవు.. ఎమ్మెల్యే గొట్టిపాటి

Published : Nov 20, 2021, 05:38 PM IST
Gottipati Ravikumar: భువనేశ్వరి గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవు.. ఎమ్మెల్యే గొట్టిపాటి

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (nara bhuvaneswari) గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (gottipati ravikumar) అన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (nara bhuvaneswari) గురించి మాట్లాడిన వైసీపీ నేతలకు పుట్టగతులు ఉండవని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (gottipati ravikumar) అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి మాట్లాడిన వైసీపీ నేతలను చూసి సభ్యసమాజం తలదించుకుంటుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కన్నీరు పెట్టారు అని ఆనందంలో ఉన్న వైసీపీ నేతలకు త్వరలోనే అసలు సినిమా చూపిస్తామని తెలిపారు.  ప్రజా క్షేత్రంలో వైసీపీ తప్పులను ఎండగట్టడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు.  2024లో అసెంబ్లీలోకి ఎందుకు అడుగుపెట్టామా అని YCP నేతలు భాదపడేలా టీడీపీ ప్రణాళిక ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలతో తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

జగన్ క్షమాపణ చెప్పాలి.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Cahndrababu Naidu) చట్టసభలను గౌరవించే వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ అంతానికి నాందిపలుకుతాయని విమర్శించారు. చట్టసభలను అమితంగా గౌరవించే చంద్రబాబు.. సభలోకి రాను అన్నాడంటే వైసీపీదుర్మార్గులు ఆయన్నిఎంత బాధ పెట్టారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. వివేకా హత్యకేసు వ్యవహారం సీఎం జగన్ (CM Jagan) మెడకు చుట్టుకోబోతోందన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతమై, తన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని భావించే ముఖ్యమంత్రి అసెంబ్లీలో దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. 

Also read: 'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..

YCP ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతను దూషిస్తుంటే.. విలన్‌లా జగన్ ఆనందిస్తాడా? అని మండిపడ్డారు. వెకిలినవ్వు లు నవ్వుతాడా? సభపై గౌరవం ఉన్నవారుఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న జగన్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. . అహంకారంతో సొంత తండ్రి చెంపఛెళ్లుమనిపించిన దుర్మార్గుడు... తల్లిని, చెల్లిని రాజకీయాలకు వాడుకొని వదిలేశాడంటూ విరుచుకుపడ్డారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్