ఈ ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా..: వైసిపి నాయకులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Dec 15, 2021, 10:21 AM IST
Highlights

తన రాజకీయ జీవితంలో పెద్దపెద్ద రౌడీలను చూసానని... నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్నది ఆకు రౌడీలేనని... వారికి భయపడిపోతానా అని టిడపి చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు.  

అమరావతి: రాజకీయాల కోసం సొంత కుటుంబసభ్యులను చంపేసిన ఫ్యాక్షనిస్టులు, నరహంతులతో పోరాడుతున్నాం... వారిని దీటుగా ఎదుర్కోవాలే తప్ప పారిపోకూడదని టిడిపి (tdp) నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) సూచించారు.  

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో (NTR Bhavan) నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల (nellore corporation election)పై చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదన్నారు. ఎంతమందిని చంపుతారు... ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారని వైసిపి (ycp) పార్టీని నిలదీసారు.

''నా 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశా...పెద్దపెద్ద గూండాలను చూశా...నెల్లూరులో ఇప్పుడున్న ఆకురౌడీలు నాకో లెక్కకాదు... వారి కథ తేలుస్తా... ధైర్యంగా ఉండండి... ఆకురౌడీలకు భయపడకండి...నేనున్నాను.  టిడిపిది 70లక్షల సైన్యం...అందరం కలసికట్టుగా తిరగబడితే పారిపోతారు...ఎవరూ భయపడొద్దు'' అని చంద్రబాబు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. 

read more  పిల్లల వస్తువులు, కూరగాయలు రోడ్డు మీద విసిరేస్తారా .. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు ఆగ్రహం

''నెల్లూరు ప్రజలు శాంతికాముఖులు...మాఫియాలను, గూండాలను సింహపురి ప్రజలు ఆదరించిన దాఖలాలు చరిత్రలో లేవు. ఇకపై నేను ముందుండి పోరాడతా... నా వెనుక కలసిరండి... వారి సంగతి చూద్దాం'' అని టిడిపి శ్రేణులకు సూచించారు. 

''నెల్లూరు (nellore)నగరాన్ని రూ.5వేల కోట్లతో అభివృద్ధి చేశాం, 40వేల ఇళ్లు టిడ్కో ఇళ్లు కట్టాం. అయినా ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో చేసినది చెప్పుకోవడంలో విఫలమయ్యాం.  అధికారపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచడంలో స్థానిక నేతలు విఫలమయ్యారు. నెల్లూరులో నాయకత్వ లోపం స్పష్టం కన్పిస్తోంది. .ప్రక్షాళన చేసి తీరుతాం. 15రోజుల్లో సమర్థులతో నెల్లూరులో అన్ని డివిజన్ లో కమిటీలు ఏర్పాటుచేస్తాం'' అని చంద్రబాబు ప్రకటించారు. 

''అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే సర్వేపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కనీసం వారు బసచేయడానికి, భోజనం చేయడానికి కూడా స్థలం ఇవ్వకుండా చేశారు. రాబోయే రోజుల్లో వారికి పదింతలు గుణపాఠం చెబుతా...రాసిపెట్టుకోండి'' అని చంద్రబాబు హెచ్చరించారు. 

''ప్రత్యర్థుల బెదిరింపులకు తలొగ్గకుండా ఎన్నికల సందర్భంగా ధైర్యసాహసాలను ప్రదర్శించిన యువకుడు రాచగిరి చంద్రశేఖర్ ను రాష్ట్ర పార్టీలోకి తీసుకుంటున్నా. ఇకపైనా ఇలాగే బెదిరింపులకు తలొగ్గకుండా ధైర్యంగా ఎదురొడ్డి పోరాడే వారికి ఆర్థికస్థోమతతో సంబంధం లేకుండా గుర్తింపు ఇస్తాం. నెల్లూరుకు చెందిన మరికొందరు యువకులకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం'' అని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

read more రాజకీయ నేరగాళ్లతో ఇక పోరాటమే... పార్టీ కేడర్ సిద్దంగా వుండాలి...: టిడిపి స్ట్రాటజీ కమిటీ కీలక నిర్ణయాలు

''వైసిపి వారికి అధికారం, డబ్బు, అంగబలం, పోలీసులు ఉన్నారు...మనకు ప్రజాబలం ఉంది... ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, రాబోయే ఎన్నికల్లో విజయం మనదే, ప్రజాక్షేత్రంలో ధైర్యంగా పోరాడాలి'' అని టిడిపి కేడర్ కు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

''కొందరు ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగిపోయారు. ఈ ఎన్నికలను గుణపాఠంగా తీసుకుందాం. ఒక నాయకుడు వెళ్లిపోయిన చోట పదిమందిని తయారుచేద్దాం. జరిగిందేదో జరిగిపోయింది. ప్రస్తుతం నాకు కావాల్సింది ఎదురొడ్డి పోరాడే సైనికులు...ప్రత్యర్థులకు లొంగిపోయే బలహీనులు, కోవర్టులు కాదు'' అని చంద్రబాబు స్పష్టం చేసారు. 

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ సీనియర్ నేతలు బిసి జనార్దనరెడ్డి, దామచర్ల సత్య, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లూరు పార్లమెంటు ఇన్ చార్జి అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

 

click me!