భార్యకు తెలియకుండా భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, చితకబాది...

Published : Dec 15, 2021, 08:54 AM ISTUpdated : Dec 15, 2021, 09:20 AM IST
భార్యకు తెలియకుండా భర్త రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, చితకబాది...

సారాంశం

భార్య తనని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో వారిద్దరిమీద నిఘా పెట్టింది. అలా సాలూరు డంపింగ్ యార్డ్ సమీపంలో ఏకాంతంగా ఉన్న భర్త, అతని ప్రియురాలు పార్వతిని red handed గా పట్టుకుంది. అయితే, పెనుగులాటలో భర్త పారిపోయాడు. ప్రియురాలిని పట్టుకొని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

విజయ నగరం జిల్లా : సాలూరులో ఓ భార్య.. భర్త వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. గత కొంతకాలంగా భర్తమీద అనుమానంతో నిఘా వేసిన ఆమె వారిద్దరినీ పట్టుకుంది. పాచిపెంట మండలంలో విద్యాశాఖ ఉద్యోగి singipuram తవుడు కొన్నాళ్లుగా పార్వతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఈ నేపథ్యంలో భార్య తనని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో వారిద్దరిమీద నిఘా పెట్టింది. అలా సాలూరు డంపింగ్ యార్డ్ సమీపంలో ఏకాంతంగా ఉన్న భర్త, అతని ప్రియురాలు పార్వతిని red handed గా పట్టుకుంది. అయితే, పెనుగులాటలో భర్త పారిపోయాడు. ప్రియురాలిని పట్టుకొని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. డిసెంబర్ 11న హైదరాబాద్ లో తనకు తాళికట్టి మరో మహిళ మోజులో పడి గుట్టుగా కాపురమే పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఓ వివాహిత. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

భర్తతో వివాహేతర సంబంధం.. పారిశుద్ధ్య కార్మికురాలిని గొంతుకోసి చంపిన భార్య..

వివరాల్లోకి వెళితే... ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన అనిల్-రామేశ్వరి దంపతులు jagadgiriguttaలో నివాసముంటున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలోకి illegal affair చిచ్చుపెట్టింది. అనిల్ మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకోవడమే కాదు కుత్బుల్లాపూర్ లోని బ్యాంక్ కాలనీలో ఏకంగా వేరుకాపురమే పెట్టాడు. ఈ విషయాన్ని భార్య రామేశ్వరికి తెలియకుండా ఇంతకాలం మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. 

అయితే భర్త వ్యవహారశైలిపై అనుమానం కలిగిన రామేశ్వరి అతడి కదలికలపై నిఘా పెట్టింది. దీంతో అతడు మరో మహిళతో అక్రమసంబంధాన్ని పెట్టుకున్నట్లు బయటపడింది. దీంతో భర్తతో పాటు అతడి ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని రామేశ్వరి భావించింది. 

అడిగినప్పుడుల్లా అతడు ఆమెకు డబ్బులిచ్చే వాడు... కానీ చివరకు అలా..

భర్త ప్రియురాలితో కలిసి వుండగా బంధువులతో కలిసి వారు కాపురముంటున్న ఇంటికి వెళ్లింది రామేశ్వరి. ఇలా ప్రియురాలితో వుండగా భర్త అనిల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ క్రమంలో రామేశ్వరితో బంధువులు అనిల్ తో పాటు అతడి ప్రియురాలిపై దాడికి యత్నించారు. దీంతో కాస్సేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఇలా ప్రియురాలితో వుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తను రామేశ్వరి పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని రామేశ్వరి పోలీసులను కోరుతోంది. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu