వచ్చే ఎన్నికలు నాకు చివరివి కావు, పోరాడుతూనే ఉంటా: నిడదవోలు సభలో చంద్రబాబు

By narsimha lodeFirst Published Dec 2, 2022, 8:37 PM IST
Highlights


భావితరాల బాగు కోసం తన పోరాటం కొనసాగిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు. వైసీపీ, సైకోలను భూస్థాపితం  కోసం తమ పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. 
 

అమరావతి:వచ్చే ఎన్నికలు తనకు  చివరి ఎన్నికలు కావని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు డిమాండ్  చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు శుక్రవారంనాడు   నిర్వహించిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ది, భావితరాల బాగు కోసమే తన పోరాటం  చేస్తున్నానని చంంద్రబాబు చెప్పారు.,వైసీపీ, సైకోలను బూస్థాపితం చేసేవరకు తన  పోరాటం చేస్తూనే ఉంటానన్నారు.

ఏపీలో సైకో పాలన సాగుతుందని చంద్రబాబు విమర్శించారు.ఇంత నీచమైన సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ఒక సైకో ఊరికో సైకోను తయారు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.ఒక సైకో చేతుల్లో రాష్ట్రం నాశనం అవుతుందన్నారు.ఏ తప్పు లేకపోయినా అమరరాజా బ్యాటరీస్ పై కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు.కేసులపై కేసులు పెడుతూ మాజీ మంత్రి  నారాయణను వేధిస్తున్నారని ఆయన  చెప్పారు. సీఎం పదవి తనకు కొత్తా అని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని నిరంతరం పనిచేశానన్నారు. రైతుల పొలాలకు నీరు ఇచ్చేందుకు ఎంతో  దూరదృష్టితో వ్యవహరించినట్టుగా  చంద్రబాబు గుర్తు చేశారు. కానీ జగన్  సర్కార్ పోలవరం ప్రాజెక్టునిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జగన్ రెడ్డి సర్కార్ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని ఆయన చెప్పారు. ఏపీకి జీవనాడిలాంటి పోలవరాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. 

also read:తాడేపల్లిగూడెంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు..

డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. పరదాలు, పోలీసులను అడ్డుపెట్టుకొని జగన్ రెడ్డి పాలన చేస్తున్నారని చెప్పారు.పదవులన్నీ స్వంత సామాజికవర్గానికే కట్టబెడుతున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శించారు.ఇదేనా సీఎం జగన్  రెడ్డి చెప్పే సామాజిక న్యాయం అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఏ ఒక్క రంగాన్ని జగన్  ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. వ్యవస్థలన్నింటిని వైసీపీ సర్కార్ నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. సకల శాఖమంత్రి సజ్జల కొండలను మింగేస్తున్నాడన్నారు. 
 

click me!