చిన్నారిని బలి తీసుకున్న కోతి.. నిద్రపోతుంటే ఈడ్చుకెళ్లి, రక్తపు మడుగులో చిట్టితల్లి

Siva Kodati |  
Published : Dec 02, 2022, 07:26 PM IST
చిన్నారిని బలి తీసుకున్న కోతి.. నిద్రపోతుంటే ఈడ్చుకెళ్లి, రక్తపు మడుగులో చిట్టితల్లి

సారాంశం

ప్రకాశం జిల్లాలో పసిబిడ్డ ప్రాణం తీసిందో కోతి. మంచంపై నిద్రిస్తోన్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి.. కిందపడేసింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రిస్తోన్న చిన్నారిని కోతి ఈడ్చుకెళ్లి కిందపడేసింది. తలకు తీవ్ర గాయం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర , సుమతి దంపతులు బెల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండు నెలల క్రితమే రెండో కుమార్తె జన్మించింది. 

ఎప్పటిలాగే శుక్రవారం కూడా రెండు నెలల చిన్నారిని ఇంటి బయటే మంచంపై పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది తల్లి. ఈ సమయంలో ఓ కోతి నిద్రిస్తోన్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి.. ఒక్కసారిగా కిందపడేసింది. పసికందుపై వ్యవసాయ సామాగ్రి పడటంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. రక్తపు మడుగులో వున్న కన్నబిడ్డను చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Railway Offer : సంక్రాంతికి ఊరెళ్లేందుకు టికెట్స్ కావాలా..? ఈ యాప్ ద్వారా కొంటే సూపర్ డిస్కౌంట్
ఏపీలో హైటెక్ సిటీ, 400కే కిలో మ‌ట‌న్‌, ఓయో గుడ్ న్యూస్‌.. 2025లో ఏసియానెట్ తెలుగులో ఎక్కువ‌గా చ‌దివిన వార్త‌లివే