విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో తమను పట్టించుకునే నాధుడే లేడంటూ కరోనా సోకిన ఓ 8నెలల మహిళ ఆందోళన వ్యక్తం చేస్తే వార్డులోని భయానక పరిస్థితులను వివరిస్తూ వీడియో చిత్రీకరించింది.
గుంటూరు: కరోనా మహమ్మారి ఏపీలో రోజురోజుకు ఉదృతంగా విస్తరిస్తోంది. దీంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వారికి వైద్యం అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. మరీముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో తమను పట్టించుకునే నాధుడే లేడంటూ కరోనా సోకిన ఓ 8నెలల మహిళ ఆందోళన వ్యక్తం చేస్తే వార్డులోని భయానక పరిస్థితులను వివరిస్తూ వీడియో చిత్రీకరించింది. ఈ వీడియోపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికన స్పందించారు.
''చనిపోయి నేలమీద పడివున్న రోగి యొక్క ఈ షాకింగ్ వీడియోను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌లో 8 నెలల గర్భిణీ చిత్రీకరించారు. 3 గంటల క్రితం రోగి వాంతి చేసి చనిపోయిగా నేలపైనే పడివుంది. ఇంకా ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదని పేర్కొంది. ఎంత భయానక మరియు బాధాకరమైన సంఘటన ఇది...'' అంటూ సదరు గర్భిణి మహిళ చిత్రీకరించిన వీడియోను జత చేస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
undefined
దారుణం.. పేషంట్ల మధ్యే కరోనా మృతదేహం.. పత్తాలేని ఆస్పత్రి సిబ్బంది..
ఓవైపు హాస్పిటల్స్ పరిస్థితి ఇలా వుంటే మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. కోవిడ్ -19కు ఏ మాత్రం కళ్లెం పడడం లేదు. గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా వైరస్ తో 15 మది మరణించారు. విశాఖపట్నం జిల్లాలో ఒక్క రోజులో వేయికి పైగా కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో విశాఖ జిల్లాలో 1049 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో ఏపీలో 6045 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 325, చిత్తూరు జిల్లాలో 345, తూర్పు గోదావరి జిల్లాలో 891, గుంటూరు జిల్లాలో 842, కడప జిల్లాలో 229, కృష్ణా జిల్లాలో 151, కర్నూలు జిల్లాలో 678, నెల్లూరు జిల్లాలో 327 కేసులు నమోదయ్యాయి.
కాగా, గత 24 గంటల్లో కొత్తగా ప్రకాశం జిల్లాలో 177, శ్రీకాకుళం జిల్లాలో 252, విజయనగరం జిల్లాలో 107, పశ్చిమ గోదావరి జిల్లాలో 672 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరు 64713 కరోనా వైరస్ కేసులు రికార్డయ్యాయి.
ఏపీలో తాజాగా గత 24 గంటల్లో 65 మంది కరోనా వైరస్ తో మరణించారు. కృష్ణా జిల్లాలో పది మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, విజయనగరం జిల్లాలో నలుగురు మరణించారు. ప్రకాశం, శ్రీకాకళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరేసి చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు కోవిడ్ -19 వల్ల 823 మంది మరణించారు.
An 8-month pregnant woman at the Covid Isolation Centre in Vijayawada Govt Hospital shot this shocking video of a patient lying dead on the floor for 3 hrs. She claims the patient vomited & died yet no staff had come about to help her. Scary & pathetic.
From: pic.twitter.com/R1tMBeukWK