మూడు రాజధానుల ప్రతిపాదన: వైఎస్ జగన్ కు ఆర్ఎస్ఎస్ ఝలక్

By telugu teamFirst Published Jul 22, 2020, 6:02 PM IST
Highlights

మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆర్ఎస్ఎస్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చింది. మూడు రాజధానుల బిల్లును తిర్సకరించారని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గవర్నర్ హరిచందన్ ను కోరారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆర్ఎస్ఎస్ తన వైఖరిని వెల్లడించింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారద ట్వీట్ చేశారు. ఆ బిల్లును తిరస్కరించాలని ఆయన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు. 

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు మూడు రాజధానుల బిల్లులు రెండు సార్లు తిరస్కరణకు గురైన తర్వాత శాసన మండలిపై జగన్ పైచేయి సాధించాలని అనుకుంటున్నారా అని ఆయన అడిగారు. వనరులు వృధా కాకుండా చూడాలని ఆయన గవర్నర్ ను కోరారు. 

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారద ట్వీట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిజెపి నేతలకు ఊపు వచ్చే అవకాశం ఉంది. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చాలా కాలంగా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పరంగా తాము అమరావతి రాజధానిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని బిజెపి రాజ్యసభ సభ్యుడు కూడా అన్నారు. 

మూడు రాజధానుల బిల్లు అనే పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్దిఎ రద్దు బిల్లు ప్రస్తుతం గవర్నర్ హరిచందన్ వద్ద పెండింగులో ఉన్నాయి. వాటిపై ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని హరిచందన్ జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఆ రెండు బిల్లులను గవర్నర్ తిరస్కరిస్తే జగన్ మరింతగా ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంది. 

click me!