జగన్ రెడ్డి సైకో పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు టిడిపి చేపట్టే నిరసనలో పాల్గొనాలని ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పిలుపునిచ్చారు.
గుంటూరు: ఏపి టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో రేపు(శుక్రవారం) టిడిపి నాయకులు, కార్యకర్తలంతా రోడ్డెక్కి నిరసనలు తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి సైకో పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు నిరసనలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.
''జగన్ రెడ్డి పిచ్చి ముదిరి పోయింది, రాష్ట్రంలో పిచ్చోడి పాలన సాగుతోంది. జగన్ రెడ్డికి అధికారం పిచ్చోడి చేతికి రాయిలా మారింది. దానితో కనబడ్డవాళ్లందరి తలలు పగులగొట్టడమే పనిగా పెట్టుకున్నారు'' అని ఆరోపించారు.
''కళా వెంకట్రావు సౌమ్యుడు, ఏనాడూ వివాదాల జోలికి వెళ్లేవాడు కాడు. ఐదుసార్లు శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, టిటిడి ఛైర్మన్ గా, 4శాఖలకు(హోంశాఖ, పురపాలక, వాణిజ్యపన్నుల, ఇంధన శాఖ) మంత్రిగా 38ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని ఈవిధంగా రాత్రి 9గంటలకు తప్పుడు కేసులో ఇరికించి అక్రమ నిర్బంధం చేయడం సిగ్గుచేటు, జగన్ రెడ్డి సైకో చేష్టలకు పరాకాష్ట.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.'' అని మండిపడ్డారు.
readmore మోనార్కా.. పదవి కోసం గౌతం సవాంగ్ జగన్ కు సరెండర్: చంద్రబాబు ఫైర్
''రామతీర్ధంలో రాముడి తల నరికివేత ఘాతుక చర్య. వైసిపి రాక్షస కాండను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..? నాతో సహా టిడిపి నేతల రామతీర్ధం పర్యటనకు అనుమతించింది పోలీసులే. నేను వెళ్లే గంట ముందు విజయసాయి రెడ్డి పర్యటనకు ఎందుకు అనుమతించారు..? ప్రభుత్వ తప్పిదాలకు టిడిపి నాయకులపై కక్ష సాధిస్తారా..?'' అని ప్రశ్నించారు.
''జగన్ రెడ్డి ఉన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి, ప్రజాస్వామ్య వాదులంతా గర్హించాలి. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలి. వైసిపి ప్రభుత్వ అరాచకాలను అందరూ గర్హించాలి. కళా వెంకట్రావు అక్రమ అరెస్ట్ పై ధ్వజమెత్తాలి. బేషరతుగా విడుదల చేయాలని, తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేయాలి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.