
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఏపీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారంటీ’ పై రేపటి నుంచి 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ప్రజలను కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే అమల్లోకి తెచ్చే కార్యక్రమాల గురించి చర్చిస్తారని, ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వారికి తెలియజేయాలని అన్నారు. ఇందులో ప్రజల సహకారం కావాలని కోరారు.
2014 నుంచి 2019 వరకు రెండంకెల వృద్ధితో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా దూసుకెళ్లిందని, కానీ, గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. భస్మాసుర పాలనలో సర్వం నాశనం అవుతున్నదని, అన్ని వర్గాలు ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలకు పరిష్కారంగా భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో పథకాలను ప్రకటించామని చంద్రబాబు తెలిపారు.
Also Read: 200వ రోజుకు చేరిన లోకేష్ యువగళం.. పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబాలు.. చంద్రబాబు అభినందనలు..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 45 రోజులపాటు బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలను, వాటి లక్ష్యాలను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు నేరుగా పార్టీ కార్యకర్తలు, నేతలు వివరిస్తారని చంద్రబాబు వివరిం చారు. ఇందుకు సంబంధించిన హామీ పత్రాన్ని ప్రజల కు ఇవ్వనున్నారు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు.