నా దగ్గర రాజకీయాలు నేర్చుకుని.. నన్నే తిడుతున్నారు: మహానాడులో బాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 28, 2020, 4:19 PM IST
Highlights

టీడీపీ ఒక ఫ్యాక్టరీ లాంటిదని.. ఇక్కడ నాయకులుగా తయారై వేరే పార్టీలో మంత్రులుగా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం నమ్మి పదవులు ఇచ్చిన వారు నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారని.. రాజకీయ భవిష్యత్ పొందినవాళ్లు కూడా మనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు

టీడీపీ ఒక ఫ్యాక్టరీ లాంటిదని.. ఇక్కడ నాయకులుగా తయారై వేరే పార్టీలో మంత్రులుగా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనం నమ్మి పదవులు ఇచ్చిన వారు నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారని.. రాజకీయ భవిష్యత్ పొందినవాళ్లు కూడా మనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తున్నామని.. అనుబంధ కమిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా కమిటీలు యాక్టీవ్‌గా ఉండాలని.. పార్టీని బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read:చంద్రబాబు ముందే భగ్గుమన్న విభేదాలు: నెహ్రూ వర్సెస్ చినరాజప్ప

ఒక్క పిలుపునిస్తే 14 వేల మంది వర్చువల్ మహానాడులోకి వచ్చి విజయవంతం చేశారని ఆయన ప్రశంసించారు. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఎన్నికలు జరుగగా అందులో 5 సార్లు గెలవగా 4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నామన్నారు టీడీపీ అధినేత.

1989లో  8.9 శాతంతో ఓడిపోగా మళ్లీ ఎన్నికల్లో 17.7 శాతం మెజారిటీ ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించామని చంద్రబాబు గుర్తుచేశారు. ఆనాడు ఎన్టీఆర్‌పై ధర్మవరంలో రాళ్ల దాడి చేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులకే పరాభవాలు తప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం దోచుకోవడం, దాచుకోవడమే వైసీపీ పరమావధని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆర్ధిక మూలాల మీద దెబ్బకొడుతున్నారని, వ్యాపారాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నరేగా డబ్బులను కేంద్రం విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిలిపివేసిందని.. దీనిపై కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు.

Also Read:సీఎం అవుదామని బాలయ్య డ్రీమ్.. బాబు ఉండగా జరిగేపనేనా: మోపిదేవి వ్యాఖ్యలు

పార్టీని వదిలి పెట్టి వెళ్లిపోయిన వాళ్లను మళ్లీ చేర్చుకునే పరిస్థితి లేదని.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి వెళ్లిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. వీరిలో సమర్ధవంతులను గుర్తిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీకి అండగా వెనకబడి వర్గాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని.. భవిష్యత్ నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని చంద్రబాబు సూచించారు. 

click me!