రాయదుర్గంలో మిడతల కలకలం: ఆందోళనలో స్థానికులు

By narsimha lodeFirst Published May 28, 2020, 3:52 PM IST
Highlights

అనంతపురం జిల్లా రాయదుర్గం దానప్పరోడ్డులో ఓ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్లపై మిడతల దండు కలకలం రేపుతోంది.


రాయదుర్గం:అనంతపురం జిల్లా రాయదుర్గం దానప్పరోడ్డులో ఓ ఇంటికి సమీపంలో ఉన్న జిల్లేడు చెట్లపై మిడతల దండు కలకలం రేపుతోంది.

ఓ ఇంటికి సమీపంలో ఉన్న రెండు జిల్లేడు చెట్లపై మిడతలు వాలిపోయాయి. పెద్ద గుంపుగా వచ్చిన మిడతలు ఈ చెట్లను కమ్ముకొన్నాయి.  ఈ మిడతలు ఉత్తర భారతం నుండి వచ్చినవా స్థానికంగా ఉన్నవా అనే విషయమై ప్రజలు చర్చించుకొంటున్నారు.ఒకవేళ మిడతలు పంట పొలాలపై దాడులు చేస్తే ఏం చేయాలనే దానిపై ఆందోళనగా ఉన్నారు.

దేశంలో దాదాపుగా నాలుగైదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇదే మిడతల దండు రాయదుర్గానికి వచ్చాయా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

also read:రాష్ట్రంపై దాడికి మిడతల దండు సిద్ధం: అధికారులు అప్రమత్తం!

పాకిస్తాన్ నుండి వచ్చిన మిడతల దండు దేశంలోని పలు రాష్ట్రాల్లో పంట పొలాలపై దండయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ మిడతల దండు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంటలను ధ్వంసం చేసిన మిడతలు  గంటకు 12 నుండి 15 కిమీ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. తన బరువు కంటే ఎక్కువగానే ఈ మిడతలు తింటాయి. ఈ మిడతలు పంటలపై పడితే ఆ పంటలు నాశనమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

click me!