భూములు, ఆస్తులు,కానుకలు విక్రయించొద్దు: టీటీడీ పాలకమండలి నిర్ణయం

By narsimha lodeFirst Published May 28, 2020, 4:04 PM IST
Highlights

 టీటీడీ, ఆస్తులు, కానుకలను విక్రయించకూడదని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకొంది. అంతేకాదు టీటీడీకి చెందిన భూములను కూడ విక్రయించకూడదని తీర్మానించారు. 


తిరుపతి: టీటీడీ, ఆస్తులు, కానుకలను విక్రయించకూడదని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకొంది. అంతేకాదు టీటీడీకి చెందిన భూములను కూడ విక్రయించకూడదని తీర్మానించారు. 

టీటీడీ ట్రస్టు భోర్డు పాలకమండలి సమావేశం గురువారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం  తీసుకొన్నారు.

 టీటీడీకి చెందిన నిరూపయోగ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు కమిటిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ కమిటిలో పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులను సభ్యులుగా ఏర్పాటు చేశారు.

also read:విరాళాలపై వెబ్‌సైట్లో సమాచారం: టీటీడీ పాలకమండలిలో చర్చ
తమిళనాడు రాష్ట్రంలోని టీటీడీకి చెందిన 23 స్థలాలు విక్రయించాలని తీసుకొన్న నిర్ణయంపై తమ పాలకవర్గంపై బురదచల్లారని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టుగా ఆయన చెప్పారు.డొనేషన్ల విధానంలో అతిథి గృహాల కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.

ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించాలని టీటీడీ ఈవోను ఆదేశించినట్టుగా ఆయన వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆసుపత్రిని తర్వలోనే ప్రారంభించనున్నట్టుగా పాలకవర్గం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలోని టీటీడీ భూముల విక్రయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  

టీటీడీ ఆస్తుల విక్రయించవద్దని హైకోర్టులో కూడ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ జరిగిన టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకొంది.లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకొంది.
 

click me!