తప్పు ప్రభుత్వానిది.. శిక్ష ఉద్యోగులకా : ఏబీ సస్పెన్షన్‌పై బాబు ఫైర్

By Siva KodatiFirst Published Feb 9, 2020, 5:30 PM IST
Highlights

ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం వరుస ట్వీట్లతో ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం వరుస ట్వీట్లతో ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

ప్రభుత్వం తప్పు చేసి.. ఆ తప్పుకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడా లేదని చంద్రబాబు ఫైరయ్యారు. పోస్టింగులు ఇవ్వకుండా నెలల తరబడి వెయిటింగ్ లో పెట్టి వేధించేది వీళ్లే,విధులకు హాజరుకాలేదని జీతాలు కోత పెట్టేది వీళ్లే. వెయిటింగ్ లో పంపినవాళ్లే, జీతాల్లో కోతపెట్టడం ఎప్పుడైనా జరిగిందా అని ప్రతిపక్షనేత ప్రశ్నించారు.

ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వెయిటింగ్ లో ఉంటే చర్యలు తీసుకోవాలిగాని, ప్రభుత్వమే వారిని వెయిటింగ్ లో ఉంచి, అవసరాల్లో సేవలు వాడుకుని, మళ్లీ వాళ్లపైనే చర్యలు చేపట్టడం అమానవీయమన్నారు. 

వైసిపిప్రభుత్వ ఫాక్షనిస్ట్ ధోరణి రానురానూ పరాకాష్టకు చేరుతోంది.ప్రతిపక్షాల నాయకులు,కార్యకర్తలపై కక్షసాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదు.రైతులు,రైతుకూలీలు,మహిళలు,యువత,కార్మికులు అన్నివర్గాల ప్రజలను అష్టకష్టాలుపెట్టి,ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులపైనే ఫాక్షనిస్ట్ పంజా విసిరింది(1/6)

— N Chandrababu Naidu (@ncbn)

 

ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వెయిటింగ్ లో ఉంటే చర్యలు తీసుకోవాలిగాని, ప్రభుత్వమే వారిని వెయిటింగ్ లో ఉంచి, అవసరాల్లో సేవలు వాడుకుని, మళ్లీ వాళ్లపైనే చర్యలు చేపట్టడం అమానవీయం. ఇంత ఉన్మాద ధోరణిని పాలకుల్లో ఎప్పుడూ చూడలేదు. ఇంత కక్షసాధింపు ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.(4/6)

— N Chandrababu Naidu (@ncbn)

 

పోస్టింగ్ లు ఇవ్వకుండా వందలాది పోలీసు అధికారులను, సిబ్బందిని గత 8నెలలుగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఇప్పుడు జీతాలు కూడా ఇచ్చేది లేదని ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గ చర్య.(3/6)

— N Chandrababu Naidu (@ncbn)

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వర రావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వర రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్ష, అపీల్) నిబంధనల నియమం 3(1) కిం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో తెలిపారు. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

Also Read:బాబు కోసమే నిఘా...ఆయనో దళారీ, మాఫియానే నడిపారు: ఏబీవీపై సజ్జల వ్యాఖ్యలు

ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు నివేదికలో తేలిందని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. 

ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయని, దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీలు లేదని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌:కేశినేనిసెటైర్లు, కౌంటరిచ్చిన ఐపీఎస్ అధికారి

1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. డీజీపీ స్థాయి అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావుకు గత 8 నెలలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.

 

click me!