మొన్న చెల్లి.. నేడు తల్లి, జగన్ అందరినీ వాడుకుని వదిలేస్తున్నాడు : విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు

Siva Kodati |  
Published : Jul 08, 2022, 06:49 PM ISTUpdated : Jul 08, 2022, 06:58 PM IST
మొన్న చెల్లి.. నేడు తల్లి, జగన్ అందరినీ వాడుకుని వదిలేస్తున్నాడు : విజయమ్మ రాజీనామాపై చంద్రబాబు

సారాంశం

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మొన్న చెల్లి వెళ్లిపోయిందని, ఇప్పుడు తల్లి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు. జగన్ అందరినీ వాడుకుంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. 

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ (ys vijayamma) రాజీనామా చేయడంపై టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) విమర్శలు గుప్పించారు. మొన్న చెల్లి వెళ్లిపోయిందని, ఇప్పుడు తల్లి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు. జగన్ అందరినీ వాడుకుంటున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. 

అంతకుముందు వైసీపీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ఏపీలో మరోసారి జగన్ పార్టీని అధికారంలోకి  వస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  ఈ ఇద్దరి బిడ్డలకు తల్లిగా అండగా ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్ భార్యగా రెండు రాష్ట్రాల్లో తాను ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు తనను అంగీకరిస్తారన్నారు. వక్రీకరణలకు, కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు ఉన్నాయనే ప్రచారానికి తావివ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.

ALso REad:2004లో టీఆర్ఎస్ బలమెంత: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్

తాను రాయని చేయని సంతకం పేరుతో సోషల్ మీడియాలో రాజీనామా లేఖ ప్రత్యక్షం కావడాన్ని ఆమె ప్రస్తావించారు.ఈ లేఖలో జగన్ కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ లేఖలో పిచ్చి రాతలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను చూస్తే వారి దిగజారుడుతనం కన్పిస్తుందన్నారు. ఈ లేఖను చూస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని కూడా అన్నించిందన్నారు.

ఈ లేఖను తాను చూసిన సమయంలో ఎంతో బాధ పడినట్టుగా ఆమె చెప్పారు.  తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఆడ, మగ అనే తేడా లేకుండా నిందలు వేశారని ఆమె మండిపడ్డారు. తాను రాయని లేఖను సోషల్ మీడియాలో ఎలా విడుదల చేస్తారని ఆమె ప్రశ్నించారు. తాను వినకూడని మాటలు కూడా విన్నానని చెప్పారు.వైఎస్ఆర్‌సీ‌పీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకొంటున్నట్టుగా విజయమ్మ వివరించారు.ఈ సమయంలో ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

తెలంగాణలో  వైఎస్ షర్మిలమ్మ ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. ఈ సమయంలో షర్మిలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో తాను తన కొడుకుకు అండగా ఉన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. జగన్ సంతోషంగా ఉన్న  సమయంలో తెలంగాణలో ఒంటరిగా ఉన్నషర్మిలకు అండగా నిలబడకపోతే ఆమెకు అన్యాయం చేసినట్టు అవుతుందని భావించి వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి వైదొలుగుతున్నట్టుగా ఆమె వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మాట్లాడుతూనే ఉంటా.. దేనికైనా రెడీ! | Professor Nageshwar Strong Reaction | Asianet News Telugu
చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ తెలుగు తమ్ముళ్లకు పూనకాలే | Mahanadu2026 | Asianet News Telugu