40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు గొంతు తడారిపోయేలా చేసిన చరిత్ర వైఎస్ జగన్ దేనని వైఎస్ విజయమ్మ చెప్పారు. శుక్రవారం నాడు వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో విజయమ్మ ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అనేక పథకాలను తీసుకు వచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు
గుంటూరు: 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు గొంతు ఎండిపోయేలా జగన్ చేశాడని వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో YS Vijayamma వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన YSRCP Plenary లో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నల్లకాలువలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఓదార్పు యాత్ర నిర్వహించినట్టుగా చెప్పారు. ఆనాడు Congress పార్టీ పొమ్మనలేక పొగ పెట్టిందన్నారు. అంతేకాదు అధికార వ్యవస్థలన్నీ కూడా తమపై దాడి చేశాయన్నారు. అయినా కూడా ఓర్పుతో పార్టీని ఏర్పాటు చేసి ముందుకు నడిపించారని విజయమ్మ వివరించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న Chandrababuకు గొంతు ఎండిపోయేలా గత ఎన్నికల్లో ఫలితాలు వచ్చేలా చేశారన్నారు. కష్టాలు వస్తాయని తెలిసి కూడా ఆ బాటను వీడలేదన్నారు. అంతేకాదు ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా కూడా జగన్ తాను నమ్మిన బాటను వీడని విషయాన్ని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు.
also read:మా గెలుపు ఆపలేకే రాక్షస గణాలు ఏకం: వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో జగన్
యువతకు జగన్ రోల్ మోడల్, ఓ మాస్ లీడర్ జగన అంటూ విజయమ్మ కితాబునిచ్చారు. మీ అందరి ప్రేమ అభిమానాన్ని జగన్ ను సంపాదించుకున్నారన్నారు. జగన్ ను మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పారు. మీరే జగన్ ను నడిపించాలని ఆమె కోరారు. నా బిడ్డను నడిపించిన మీ అందరికి కృతజ్ఞత చెబుతున్నానన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని విజయమ్మ గుర్తు చేశారు.అమ్మఒడి, గ్రామ సచివాలయాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి తీసుకువచ్చామన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి కాకుండా చెప్పనవి కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా ఆమె గుర్తు చేశారు.