ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ: నీలం సహానీకి బాబు ఫోన్

By narsimha lodeFirst Published Nov 8, 2021, 9:25 PM IST
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని తమ పార్టీకి చెందిన అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను ఫోర్జరీ పత్రాలతో ఉప సంహరింపచేస్తున్నారని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు.ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  నీలం సహానీకి ఫోన్ చేశారు.

అమరావతి:Nellore, kuppam , దర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని టీడీపీ  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. Tdp  చీఫ్ Chandrababu Naidu  ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  Nilam Sawhneyతో సోమవారం నాడు ఫోన్‌లో మాట్లాడారు.ప్రజాస్వామయాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలని చంద్రబాబు నీలం సహానీని కోరారు. ఫోర్జరీ సంతకాలతో తమ పార్టీ అభ్యర్ధుల నామినేషన్లను విత్ డ్రా చేస్తున్నారన్నారు.

also read:మరో 11 స్థానిక సంస్థలకు ఎన్నికలు: ఏపీ ఎన్నికల సంఘం సన్నాహాలు

ఈ మూడు చోట్ల చోటు చేసుకొన్న కొన్ని ఘటనలను చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు వివరించారు. కుప్పం  మున్సిపాలిటీలోని 13,14, 15 వార్డుల్లో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు ఉపసంహరించినట్టుగా ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు.  తక్షణమే ఈ మూడు వార్డుల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి సమగ్ర విచారణ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.కుప్పంతో పాటు  దర్శి నగర పంచాయితీల్లో తుది జాబితా ప్రకటించకపోవడంపై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి  చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన అభ్యర్ధులను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై స్థానికంగా ఉన్న అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయమై అధికారుల నుండి సరైన స్పందన రాకపోవడంతో  చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  నీలం సహానీకి ఫోన్ చేశారు.

మరోవైపు కుప్పం మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్‌గా లోకేశ్ వర్మ నియామకంపై టీడీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసింది. లోకేశ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తక్షణమే లోకేశ్వర వర్మను కుప్పం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తెలుగుదేశం పార్టీ  పిటిషన్‌లో పేర్కొంది

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 498 గ్రామ పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ,533 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల్లో కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవలనే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు రెండు రోజులు పర్యటించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. గతంలో ఫిర్యాదు చేసిన నేతలను ఈ టూర్ లో చంద్రబాబునాయుడు దూరంగా ఉంచారు. ఈ టూర్ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందో లేదో అనేది ఎన్నికల పలితాలు తేల్చనున్నాయి. 

ఈ నెల 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లలో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి ఈ నెల 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి నవంబర్ 18న ఫలితాలు వెల్లడిస్తారు.

 

click me!