క్వశ్చన్ పేపర్ రాసిచ్చిన వారికే ఫస్ట్ ర్యాంకులు: సచివాలయ ఉద్యోగాలపై బాబు సెటైర్లు

By Siva KodatiFirst Published Oct 18, 2019, 1:02 PM IST
Highlights

సచివాలయ ఉద్యోగాలు మెరిట్ ఉన్నవారికే ఇచ్చామని చెబుతున్నారని కానీ.. ఎవరైతే క్వశ్చన్ పేపర్ టైప్ చేశారో వాళ్లకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారని టీడీపీ అధినేత సెటైర్లు వేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదని.. డబ్బు పెట్టిన వారికే ఉద్యోగాలు దొరికాయని చంద్రబాబు ఆరోపించారు. 

పత్రికా స్వేచ్ఛ, మీడియాపై ఆంక్షల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో అన్ని రంగాల్లో ఫెయిలయ్యారని బాబు ఎద్దేవా చేశారు.

ఇసుక కొరతను సృష్టించారని దీని వల్ల జనానికి సొంత గ్రామాల్లోనే ఇసుక లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండాయని కానీ రాష్ట్రాన్ని కరెంట్ కోతలు చుట్టుముడుతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు.

సచివాలయ ఉద్యోగాలు మెరిట్ ఉన్నవారికే ఇచ్చామని చెబుతున్నారని కానీ.. ఎవరైతే క్వశ్చన్ పేపర్ టైప్ చేశారో వాళ్లకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారని టీడీపీ అధినేత సెటైర్లు వేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదని.. డబ్బు పెట్టిన వారికే ఉద్యోగాలు దొరికాయని చంద్రబాబు ఆరోపించారు.

విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారని.. చివరికి మీడియాను సైతం వదలడం లేదని తునిలో విలేకరిని దారుణంగా హతమార్చారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ఇదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని దీనిపై తాను పోరాటం చేశానని చంద్రబాబు గుర్తు చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై ఎవ్వరు మాట్లాడటానికి వీలులేదని డీజీపీ చెబుతున్నారని.. కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్‌లు పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వర్లరామయ్యను పోలీస్ కానిస్టేబుల్ హెచ్చరించారని.. పోలీస్ వ్యవస్ధను ప్రశ్నించడం తప్పా అని ఆయన దుయ్యబట్టారు.

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ విలేకరిని అసభ్యకరంగా దూషించినా అడిగే దిక్కులేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్ధుల ఓటమికి పనిచేసిన జర్నలిస్టులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు బెదిరిస్తున్నారని ప్రతిపక్షనేత తెలిపారు.

తునిలో విలేకరిని హత్య చేసి నాలుగు రోజులు గడిచిన తర్వాత ఎమ్మెల్యేపై తీరిగ్గా కేసు నమోదు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. జరుగుతున్న దారుణాలపై డీజీపీకి ఫిర్యాదు చేద్దామని టీడీపీ నేతలు వెళితే ఆయన ఉండరని.. వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీ కార్యాలయానికి వెళితే రెడ్ కార్పెట్ వేసి అక్కడే ప్రెస్‌మీట్ పెట్టిస్తారని బాబు ఎద్దేవా చేశారు.

వ్యాఖ్యల చిక్కులు: చంద్రబాబు, హర్షకుమార్, వర్లలకు నోటీసులు

అది డీజీపీ కార్యాలయమా లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసా అంటూ ఆయన సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ జైలు మేట్లను వెంటేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు హద్దులు దాటినా అది ప్రజాస్వామ్య హితం కాదని చంద్రబాబు దుయ్యబట్టారు.

ఉండవల్లిలో తన ఇంటికి తాడు కట్టారని.. రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చేశారని టీడీపీ అధినేత గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదని రాష్ట్రమే శాశ్వతమన్నారు. వరల్డ్ బ్యాంక్, ఏసియన్ బ్యాంకులు అమరావతికి ఇచ్చే రుణాన్ని ఉపసంహరించుకుందని వృద్ధిరేటు పడిపోయిందని బాబు గుర్తు చేశారు. 
 

click me!