విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..?

By Siva KodatiFirst Published Oct 18, 2019, 11:28 AM IST
Highlights

విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు

విశాఖపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం కలిగించిన భూకుంభకోణంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుంది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డ్ జిల్లా జడ్జి టి.భాస్కరరావు వ్యవహరిస్తారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల తారుమారు, అసైన్డ్ భూముల ఆక్రమణలతో పాటు ఈ కుంభకోణంలో వెలుగుచూసిన అన్ని అంశాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఇందుకు సంబంధించి సిట్‌కు ప్రభుత్వం పూర్తి అధికారాలు కల్పించింది.

తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వాధికారులు, మంత్రులు, అధికార పార్టీ నేతలు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ లెక్కల ప్రకారం విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు తారుమారయ్యాయి.

డెంగ్యూ ఫీవర్‌తో బాలనటుడు మృతి

వీటి విలువ దాదాపు రూ.25,000 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపించింది. విశాఖ భూముల విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ కమిటీ వేశారు.

అనంతరం ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ మేరకు సిట్‌ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 2,875 కేసులు నమోదవ్వగా.. వాటిలో కేవలం 336నే పరిగణనలోకి తీసుకున్నారు.

విశాఖ జిల్లాలో ఉన్న 3,022 గ్రామాల్లో 2 లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు అప్పట్లో చర్చ జరిగింది.

కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దానిని 10,000 ఎకరాలు మాత్రమే చిత్రించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నేతల అవినీతి పర్వం బట్టబయలైతే 2019 ఎన్నికలకు అడ్డంకిగా మారుతుందని భావించిన చంద్రబాబు సొంత పార్టీ నేతలకు క్లీన్ చీట్ ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి.

కోర్టు ముందుకు నేడు ఆర్టీసి సమ్మె: అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం

గంటాకు సమీప బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్ చేయించుకుని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

గంటా వర్గంగా ఉన్న భీమిలికి చెందిన నేతలే పెద్ద ఎత్తున అక్రమ భూసేకరణకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేశ్ బాబు, వెలగపూడి రామకృష్ణబాబులతో పాటు పలువురు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖతో పాటు రాష్ట్రంలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ చేయిస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగానే విశాఖ భూకుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేశారు.

click me!