కల్కి ఆశ్రమాల్లో ఐటి సోదాలు: గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు

By narsimha lodeFirst Published Oct 18, 2019, 11:53 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా సోదాలు కొనసాగుతన్నాయి. భారీ ఎత్తున ఐటీ శాఖాధికారులు నగదును స్వాధీనం చేసుకొన్నారని సమాచారం.

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో ఆదాయపు పన్ను శాఖాధికారులు మూడోరోజైనా శుక్రవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు.కల్కి ఆశ్రమంలో భారీ ఎత్తున నగదును, కీలకమైన డాక్యుమెంట్లను ఆదాయ పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు... ఆంధ్ర, తమిళనాడుల్లో ఎనిమిది బృందాలు (వీడియో)

వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో మూడు రోజులుగా  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలను ప్రారంభించారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐటీ అధికారులు చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని బత్తువల్లం, ఉబ్బలమడుగు సమీపంలోని ఏకం ఆలయం, విడిది గృహాల్లో ఉండి సోదాలు నిర్వహిస్తున్నారు.

కల్కి ఆశ్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఆదాయ పన్ను శాఖాధికారులు  సోదాలు చేస్తున్నారు. ఆశ్రమంలో పనిచేసేవారిని, నిర్వాహకులను మాత్రమే ఆశ్రమంలోకి అనుమతి ఇస్తున్నారు.  బయటివారిని అనుమతించడం లేదు. 

ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న లోకేష్ దాసాజీ, శ్రీనివాస్ లను కూడ వేర్వేరుగా  పోలీసులు ప్రశ్సిస్తున్నారు. ఆశ్రమంలో పనిచేస్తున్న దాసాజీలను కూడ ఆదాయ పన్ను శాఖాధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు.

కల్కి భగవాన్ నివాసం ఉన్న వన్నెస్ క్యాంపస్-3 లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేశారు.కల్కి ఆశ్రమం పేరును తరచూ ఎందుకు మారుస్తున్నారని కూడ  ఐటీ అధికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం.

కల్కి ఆశ్రమం పేరుతో ఈ సంస్థలో సభ్యులుగా ఉన్న వారి పేరుతో భూములు, నిధులు ఉన్నాయనే విషయమై కూడ ఆదాయ పన్ను శాఖాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆశ్రమంలోని కంప్యూటర్  నుండి హార్డ్ డిస్కులను, ఇతర కీలక పత్రాలను కూడ ఆదాయ పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

కల్కి ఆశ్రమంలో  సుమారు రూ. 8 కోట్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా సమాచారం. వీదేశీ నగదుతో పాటు ఇతర కీలకపత్రాలను కూడ స్వాధీనం చేసుకొన్నారని సమాచారం.మరోవైపు కల్కి భగవాన్ ఆశ్రమం నుండి విదేశాలకు నిధులను  తరలిస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ విషయమై కూడ ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

కల్కి ఆశ్రమంతో పాటు చిత్తూరు, హైద్రాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో కూడ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఆదాయ పన్ను శాఖాధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది.

హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటీ ప్రాంతాల్లో కల్కి భగవాన్ తనయుడు లోకేష్ రియల్ ఏస్టేట్ వ్యాపారం నిర్వహించినట్టుగా ఐటీ శాఖాధికారులు గుర్తించారు. రియల్ ఏస్టేట్ వ్యాపారానికి సంబంధించిన సమాచారాన్ని కూడ ఐటీ అధికారులు సేకరిస్తున్నారని సమాచారం.

ఐటీ శాఖాధికారులు వరదయ్యపాలెంలోని ఆశ్రమంలో ఇతరులకు ప్రవేశం కల్పించడం లేదు. ఆశ్రమం నుండి బయటకు కొంత నగదును తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఐటీ అధిాకారులు గుర్తించి స్వాధీనం చేసుకొన్నారు.  ఆశ్మరమలో దొరికిన పత్రాల ఆధారంగా ఐటీ శాఖాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

click me!