మైనారీటీల అభ్యునతి కోసం, వక్ఫ్ భూముల రక్షణ కోసం ఏర్పాటైన వక్ఫ్ బోర్డులో పనిచేసే అధికారులు విచక్షణారహితంగా మద్రసాలో పిల్లల నిత్యావసర వస్తువులు, కూరగాయలు బయట పడేసిన తీరుపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
వై.సీ.పీ (ysrcp) నేతల ఆరాచకాలకు గుడి, బడి అనే వ్యత్యాసం కూడా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . వై.సీ.పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మైనారీటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసి, ఎయిడెడ్ విద్యాసంస్థల (aided schools in andhra pradesh) భూములను దోచుకోవడానికి వేలాది మంది జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
మదర్సా స్థలాలపై ప్రభుత్వం కన్ను పడిందని... వేలాది ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. వక్ఫ్ బోర్డు స్థలాలను రక్షించలేని వైసీపీ ప్రభుత్వం స్థలాన్ని లీజుకు తీసుకొని సేవా భావంతో విద్యార్దులకు విద్యను అందిస్తున్న టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నడిపించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారుల దాడి రాజకీయ కక్ష సాధింపేనని చంద్రబాబు దుయ్యబట్టారు.
undefined
Also Read:Childrens Day: వారు రోడ్డునపడకుండా వుండేందుకు... నేనే రోడ్డెక్కుతా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
మైనారీటీల అభ్యునతి కోసం, వక్ఫ్ భూముల రక్షణ కోసం ఏర్పాటైన వక్ఫ్ బోర్డులో పనిచేసే అధికారులు విచక్షణారహితంగా మద్రసాలో పిల్లల నిత్యావసర వస్తువులు, కూరగాయలు బయట పడేసిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని.. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా మదర్సాను యధావిధిగా కొనసాగించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.